Begin typing your search above and press return to search.
సీఏఏపై మళ్లీ వివాదం.. భగవత్ అలా.. ఓవైసీ ఇలా!
By: Tupaki Desk | 26 Oct 2020 9:00 AM ISTకేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సిటిజన్ షిప్ ఎమెండ్‌మెంట్ యాక్ట్(సీఏఏ)పై మళ్లీ వివాదం రాజుకుందా? అటు ఆర్ ఎస్ ఎస్, ఇటు ఎంఐఎం పార్టీ మరోసారి ఈ వివాదాన్ని తెరమీదికి తెచ్చాయా? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. కరోనాకు ముందు దేశంలో ఇదే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే.. అల్లర్లు కూడా చోటు చేసుకున్నాయి. అయితే, కరోనా నేపథ్యంలో ఈ వివాదం సమసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, తాజాగా విజయదశమి సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్‌భగవత్.. మరోసారి ఈ విషయాన్ని ప్రస్థావించారు.
సీఏఏ విషయంలో కొందరు కావాలనే దేశంలోని ముస్లిం వర్గాన్ని తప్పుదోవ పట్టించారని అన్న భగవత్.. సున్నితమైన అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారంటూ.. ముస్లిం నేతలపై విరుచుకుపడ్డారు. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా, వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చారని, నిరసనల పేరుతో వ్యవస్థీకృత హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించారని అన్నారు. అదేసమయంలో ఆయన మరోసారి `హిందూత్వ అనేది భారత జీవన విధానం` అని నొక్కి చెప్పారు. అంతేకాదు, అధిపత్యం పేరిట తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని భగవత్ పిలుపునిచ్చారు.
సీఏఏకి సంబంధించి సందేహాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భగవత్ సూచించారు. ఇదిలావుంటే, భగవత్ వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అంతే సూటిగా స్పందించారు. ఎవరో తప్పుదోవ పట్టించడానికి తామేమైనా చిన్న పిల్లలమా? అని ప్రశ్నించారు. ఒక వేళ ఈ చట్టం ముస్లింలను టార్గెట్ చేయడానికి కానట్లయితే.. సీఏఏలో మతం ప్రస్తావన ఎందుకు చేశారంటూ భగవత్‌ను ఆయన నిలదీశారు. చట్టంలో మతం ప్రస్తావన తొలగిస్తారా? అని ప్రశ్నించారు. దేశంలోని ముస్లింలు తమ భారతీయతను నిరూపించుకోవాల్సిన చట్టాలు ఎందుకన్న ఆయన ఇలాంటివి పోయేదాకా నిరసనలు చేస్తూనే ఉంటామని నొక్కి చెప్పారు.
అంతేకాదు, ప్రస్తుత బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఈ చట్టాన్ని ప్రచార అస్త్రంగా ఎందుకు చేసుకుందని ఒవైసీ నిలదీశారు. ముస్లింలకు అన్యాయం చేయడంలో బీజేపీతోపాటు కాంగ్రెస్‌కు కూడా పాత్ర ఉందని దుయ్యబట్టారు. ఈ పరిణామాలను గమనిస్తే.. సీఏఏపై మళ్లీ రచ్చ ప్రారంభం కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.