Begin typing your search above and press return to search.

పుల్వామా ఘటనపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   24 Feb 2019 10:38 AM GMT
పుల్వామా ఘటనపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
X
పుల్వామా ఉగ్రదాడి ఘటనపై తొలిసారి ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ స్పందించారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై, ఆ దేశ ప్రధానిపై సంచలన కామెంట్స్ చేశారు. ముంబైలో జరిగిన ఒక ర్యాలీలో పాల్గొన్న ఓవైసీ మాట్లాడారు... పుల్వామా ఘటనపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమాయకత్వం నటిస్తున్నారని విమర్శించారు. ఇమ్రాన్ ఖాన్ కెమెరా ముందు కూర్చొని భారత్ కు సందేశాలు ఇవ్వనక్కర్లేదని హితవు పలికారు.

పుల్వామా దాడియే భారత్ పై జరిగిన మొదటి దాడి కాదని.. పఠాన్ కోట్, ఉరి, ఇప్పుడు పుల్వామా.. పాకిస్తాన్ అమాయకత్వపు ముసుగు తీయాలని భారత్ తరుపున తాను కోరుతున్నానంటూ ఓవైసీ విమర్శలు గుప్పించారు.

1947లో జిల్లా ప్రతిపాదిత దేశ విభజనను వ్యతిరేకించి ముస్లింలంతా స్వచ్ఛందంగా ఇండియాలోనే ఉండిపోయారని.. భిన్నత్వంలో ఏకత్వం ఇండియా విధానమని ఓవైసీ కొనియాడారు. భారత దేశ పౌరులంతా కలిసి మెలిసి ఉండడం చూసి పాక్ కుళ్లుకుంటోందని విమర్శించారు.

భారత్ లోని ఆలయాల్లో గంటలు మోగకుండా చేస్తామని పాకిస్తాన్ మంత్రి హెచ్చరించడంపై ఓవైసీ మండిపడ్డారు. ఇండియా గురించి ఆయనకు తెలియదని.. ఈ దేశానికి చెందిన ముస్లింలు బతికున్నంత కాలం.. మసీదుల్లో అజాన్ వినిపిస్తుందని.. ఆలయాల్లో గుడిగంటలు మోగుతూనే ఉంటాయని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇండియా సౌందర్యమే అది అని.. పొరుగుదేశం పాక్ కు ఇది అసూయగా ఉందని ధ్వజమెత్తారు.దేశ ప్రజలంతా ఒకటిగా జీవిస్తారని.. దేశం కోసం ఒకటి ముందుకు సాగుతారని ఓవైసీ పేర్కొన్నారు.

భారత దేశ పౌరుడిగా నేను చెప్తున్నానని.. పుల్వామా దాడితో పాకిస్తాన్ కు లింకులున్నాయని.. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ పథకం ప్రకారమే ఈ దాడి చేశాయని ఓవైసీ విమర్శించారు. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే పాత్రపైన ఓవైసీ విరుచుకుపడ్డారు. మహ్మద్ ను నమ్మేవారెవ్వరూ ఏ ఒక్కరిని చంపరని స్పష్టం చేశారు. జైషే అంటే సైతాన్ అని.. మసూద్ సైతాన్ అంటూ పాక్ ఉగ్ర సంస్థలపై ఓవైసీ నిప్పులు చెరిగారు.