Begin typing your search above and press return to search.

మాజీ ప్ర‌ధానితో ఓవైసీ కొత్త దోస్తీ...

By:  Tupaki Desk   |   29 March 2018 7:56 AM GMT
మాజీ ప్ర‌ధానితో ఓవైసీ కొత్త దోస్తీ...
X

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన సంగ‌తి తెలిసిందే. మే నెల 12న ఒకే దశలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో కన్నడ రాష్ట్రంలో ఎన్నికల రణానికి కౌంట్‌ డౌన్ ప్రారంభమైంది. అన్ని పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. అయితే హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ కేంద్రంగా ఏర్ప‌డిన ఎంఐఎం పార్టీ కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో అసదుద్దీన్‌ కు చెందిన పార్టీ సుమారు 40 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఈ అంశంలో వ్యూహారచన చేసేందుకు కర్ణాటక యూనిట్‌ తో ఎంఐఎం చీఫ్ ఒవైసీ ఇవాళ భేటీకానున్నారు.

ఇటీవల పార్లమెంట్‌ లో ఓవైసీతో మాజీ ప్రధాని దేవగౌడ మాట్లాడారు. దీంతో రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఖాయ‌మ‌ని జేడీఎస్‌ తో జత కట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా అసద్ పార్టీ నేతలు వెల్లడించారు. అయితే దీనికి తుది రూపం రాలేదు. మ‌రోవైపు జేడీఎస్ ఇప్పటికే బీఎస్పీతో జోడీ కట్టింది. ఇక ఎంఐఎంతోనూ జత కట్టి.. ఎన్నికల్లో మైనార్టీలను ఆకర్షించాలని భావిస్తున్నది. ఈ నేప‌థ్యంలో పొత్తుల‌పై తేల్చుకునేందుకు క‌ర్ణాట‌ట‌కు చీప్‌ తో ఓవైసీ స‌మావేశం అవుతున్న‌ట్లు స‌మాచారం.

కాగా, మే 12న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. బీజేపీ కొనసాగిస్తున్న జైత్రయాత్ర కాంగ్రెస్ చివరి కంచుకోటను సైతం కైవసం చేసుకుంటుందా లేదా అనేది మే 15న తేలిపోనుంది. ఈ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగిస్తామని, వాటిని ఓటును తనిఖీ చేసుకొనే వీవీపీఏటీ యంత్రాలకు అనుసంధానం చేస్తామని ఈసీ పేర్కొంది. 2013లో 4,36,85,739 మంది ఓటర్లు ఉండగా.. 2018నాటికి ఈ సంఖ్య 4,96,82,351కి పెరిగింది.