Begin typing your search above and press return to search.

అసదుద్దీన్‌ ఒవైసీ ఆస్తుల విలువ 13 కోట్లు

By:  Tupaki Desk   |   19 March 2019 11:07 AM IST
అసదుద్దీన్‌ ఒవైసీ ఆస్తుల విలువ 13 కోట్లు
X
హైదరాబాద్‌ ఎంపీగా నామినేషన్‌ వేశారు సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. హైదరాబాద్‌ నుంచి ఒవైసీ గెలుపు నామమాత్రం. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి నిలబడినా గెలుపు మాత్రం ఒవైసీదే. దీంతో.. నోటిఫికేషిన్‌ వచ్చిన గంటలోపే నామినేషన్‌ పత్రాల్ని అసదుద్దీన్‌ ఒవైసీ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల్ని ఎన్నికల అఫిడవిట్‌ లో సమర్పించారు. ఆయన అపిఢవిట్ ప్రకారం అసదుద్దీన్‌ ఒవైసీ ఆస్తుల విలువ రూ.13 కోట్లు. లిక్విడ్‌ ఆస్తులు రూ.1.67 కాగా - నిరర్థక ఆస్తుల విలువ రూ.12 కోట్లుగా చూపించారు. ఇక అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆయనకు సొంతంగా కారు కూడా లేదు. ఇక అసదుద్దీన్‌ ఒవైసీ భార్య లిక్విడ్ ఆస్తులు రూ.10.40 లక్షలు కాగా.. నిరర్థక ఆస్తుల విలువ రూ. 3.75 కోట్లుగా ప్రకటించారు.

అసదుద్దీన్‌ ఒవైసీకి ఆస్తులే కాదు అప్పులు కూడా ఉన్నాయి. ఆయన తన అప్పుల్ని రూ.9.30 కోట్లుగా చూపించారు. ఇందులో రూ.5 కోట్లను తన తమ్ముడైన అక్బరుద్దీన్‌ ఒవైసీ దగ్గర అప్పుగా తీసుకున్నట్లరు పేర్కొన్నారు. అలాగే తన భార్యకు కూడా అప్పులు ఉన్నాయని - దాని విలువ రూ.1.20 కోట్లు ఉంటుందని అఫిడవిట్‌ లో చూపించారు. అలాగే 2017-18 తన ఆదాయాన్ని అసదుద్దీన్‌ ఒవైసీ రూ.10 లక్షలుగా చూపించారు. అంతకుముందు ఏడాది రూ.13.33 లక్షలుగా చూపించారు ఒవైసీ. ఇక ఆయన దగ్గర రెండు తుపాకులు ఉన్నాయి. .22 పిస్టల్‌ మరియు ఎన్‌ పి బోర్‌ 30-60 రైఫిల్ ఉన్నాయి. ఈ రెంటి విలువ రూ.2 లక్షలు. చేతిలో రూ.2 లక్షల రూపాయల నగుదు ఉందని - రూ. 43 లక్షల రూపాయలు డిపాజిట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆయన భార్యకు 20 తులాల బంగారం ఉంది. దీని విలువ రూ.6.40 లక్షలు. ఇక నగదు రూ.2 లక్షలు - బ్యాంకులో రూ.లక్ష ఉంది.