Begin typing your search above and press return to search.

అస‌ద్ మళ్లీ కెలికాడు క‌దా!

By:  Tupaki Desk   |   9 April 2016 10:01 AM IST
అస‌ద్ మళ్లీ కెలికాడు క‌దా!
X
ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ త‌మ సిద్ధాంత విరోధి రాష్ర్టీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌ ను మ‌ళ్లీ కెలికారు. ఆర్ ఎస్ ఎస్ ట్రేడ్‌ మార్క్ అయిన నిక్క‌ర్ల స్థానంలోనే ప్యాంట్ల‌ను ధ‌రించాల‌ని ఇటీవ‌లే నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భాన్ని ప్ర‌స్తావిస్తూ ప్యాంట్లు వేసుకున్నంత మాత్రాన పెద్ద మ‌నుషులు అయిపోతారా అంటూ అస‌ద్ కెలికారు

ఆర్‌ ఎస్‌ ఎస్ 1925లో నిక్కర్లతో ఏర్పాటయిందని.. ఇప్పుడు ప్యాంట్లలోకి వచ్చి పెద్దమనుషుల్లా చెలామణి అవుతోందని ఓవైసీ ఎద్దేవా చేశారు. అయితే దుస్తులు మార్చినంత మాత్ర‌న పెద్ద‌రికం వ‌స్తుందా అంటూ ఆయ‌న నిల‌దీశారు. ఎంఐఎం మతతత్వ పార్టీ కాదని మ‌రోమారు తెలియ‌జెప్పారు. త‌మ‌ది ముస్లిం - దళిత సోదరుల ఎజెండా అని వ్యాఖ్యానించారు. ఈ రెండు వర్గాలపై దాడులను నిరోధించడంతో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఓవైసీ మండిప‌డ్డారు. ఎన్నికల ముందు ముస్లింలకు ఇచ్చిన హామీలను పాల‌కులు విస్మరించారని ఓవైసీ ఆరోపించారు.