Begin typing your search above and press return to search.
దీదీతో దోస్తీకి అసద్ ప్లానింగ్.. అదే జరిగితే?
By: Tupaki Desk | 20 Nov 2020 1:00 PM ISTబిహార్ ఎన్నికల్లో అనూహ్యంగా ఐదు అసెంబ్లీ స్థానాల్ని సొంతం చేసుకున్న మజ్లిస్.. ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేసేలా పావులు కదుపుతోంది. మరో ఏడాదిలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు బెంగాల్ అధికారపక్షంతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారు. మమతతో స్నేహ హస్తం చాచి.. కలిసి పోటీ చేయాలన్న ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు.
రెండు పార్టీల ఉమ్మడి శత్రువు అయిన బీజేపీని కలిసి ఓడిద్దామన్న అసద్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో మైనార్టీలు ఎక్కువగా ఉన్న మల్దా.. ముర్షిదాబాద్.. ఉత్తర దినాజ్ పూర్.. దక్షిణ దినాజ్ పూర్.. దక్షిణ 24 పరగణా జిల్లాలపై అసద్ ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఈ జిల్లాల్లో 60 వరకు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మరి.. అసద్ ప్రతిపాదనకు మమత ఏమని బదులిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
చూస్తూ.. చూస్తూ.. అసద్ తో చేయి కలిపితే దీదీకే నష్టమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు టీఎంసీతోనే ఉన్న మైనార్టీలు.. మజ్లిస్ ఎంట్రీతో వారి వైపు వెళ్లే అవకాశం ఉంది. మజ్లిస్ తో మిత్రత్వం ఇప్పటికిప్పుడు లాభం కలిగించినా.. భవిష్యత్తులు ఇబ్బందికి గురి చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మైనార్టీల ఓటు బ్యాంకు ఉన్న టీఎంసీకి ప్రత్యక్ష నష్టం వాటిల్లేలా చేయటం కోసమే మజ్లిస్ ను బీజేపీ ముందుకు నెట్టినట్లుగా భావిస్తున్నారు.
మజ్లిస్ వెనుక ఉన్నది బీజేపీనేనని.. బీటీంగా పని చేస్తూ లౌకిక పార్టీల ఓటు బ్యాంకుకు నష్టం వాటిల్లేలా చేయటమే బీజేపీ లక్ష్యమన్న వాదనను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. బెంగాల్ లో 24 శాతం బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఉంటే.. ఆరు శాతం మంది మత్రమే హిందీ మాట్లాడే ముస్లింలు ఉన్నారు. మజ్లిస్ నేరుగా బరిలోకి దిగితే.. బిహార్ లో మహాకూటమి మాదిరి బెంగాల్ లో దీదీకి నష్టం చేకూరే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి చర్చ నడుస్తున్న వేళలోనే.. దీదీకి స్నేహ హస్తాన్ని చాచారు అసద్. మరి.. ఆయన ప్రపోజల్ కు దీదీ ఓకే అంటారా? నో చెబుతారా? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.