Begin typing your search above and press return to search.
బీజేపీకి 24 గంటలు సమయమిచ్చిన అసద్
By: Tupaki Desk | 25 Nov 2020 10:00 AM ISTగ్రేటర్ ఎన్నికల వేళ.. నేతల నోట మాటలు తూటాల్లా పేలుతున్నాయి. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే అయినా.. ఊహించని రీతిలో మాట్లాడే తెలంగాణ బీజేపీ రథసారధి బండి సంజయ్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్తీలో ‘సర్జికల్ స్ట్రైక్స్’ నిర్వహిస్తామన్న మాటతో సంచలనంగా మారారు. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ రగడ షురూ అయ్యింది.
బండి సంజయ్ నోట వచ్చిన సర్జికల్ మాటపై మజ్లిస్.. టీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. బీజేపీకి 24 గంటలు టైమిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘పాతబస్తీలో పాకిస్తాన్ వాళ్లెవరో చెప్పాలి. చైనా 970 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని అక్రమించింది. దమ్ముంటే అక్కడకు వెళ్లి అమిత్ షా సర్జికల్ స్ట్రైక్ చేయాలని.. దేశం నుంచి ముస్లింలను వేరు చేయలేరు’ అని వ్యాఖ్యానించారు.
టెర్రరిస్టులు.. పాకిస్తాన్ అనే పదాలు లేకుండా ఎన్నికల ప్రచారం చేయలేరా? దమ్ముంటే చదువు.. డెవలప్ మెంట్ గురించి చెప్పి గెలవాలన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో అసద్ నోటి నుంచి వస్తున్న ఈ మాటలపై పలువురు స్పందిస్తున్నారు. దమ్ముంటే.. చదువు.. అభివృద్ధి గురించి చెప్పి ఎన్నికల్లో గెలవాలన్న అసద్.. అవే మాటలు వర్తిస్తాయని చెబుతున్నారు. నోరు తెరిస్తే చాలు.. మతాన్ని ప్రస్తావించే ఆయన.. ఈ రోజు ఇలా నీతులు చెప్పటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ మాటల నేపథ్యంలో..అసలు ఆయన ఏమన్నారన్న విషయాన్ని చూస్తే.. మంగళవారం రామంతపూర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ఎన్నికల్లో బీజేపీగెలిస్తే.. మేయర్ పీఠం దక్కించుకుంటే.. బిడ్డా నీ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. రోహింగ్యాలను..పాకిస్తాన్ వారిని తరిమి తరిమి కొడతాం’’ అని వ్యాఖ్యానించారు.
బండి సంజయ్ నోటి నుంచి ఆ మాటకు కారణం అసద్ అని కూడా చెబుతున్నారు. అదెలానంటే...తన ప్రచారంలో భాగంగా నగరంలోని రోహింగ్యాలు ఉంటే కేంద్రమంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అసద్ వ్యాఖ్యలకుకౌంటర్ గా బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం సర్జికల్ స్ట్రైక్ మాట పెను వివాదంగా మారింది. అసద్ ఇచ్చిన 24 గంటల సమయంలో ఆయన కోరినట్లు బీజేపీ స్పందిస్తుందా?అన్నది చూడాలి.