Begin typing your search above and press return to search.
మొండితనం మోడీని ముంచేస్తుందిగా?
By: Tupaki Desk | 9 Dec 2020 11:00 AM ISTఅధికారం చేతిలోకి వచ్చినంతనే.. అధినేత తీరు ఒక్కసారిగా మారుతుంది. జీవితంలో బోలెడన్ని కష్టనష్టాల్ని.. ఎదురుదెబ్బల్ని తిన్న వారు సైతం.. చేతికి అపరిమితమైన అధికారం వచ్చాక.. వాస్తవాల్ని మర్చిపోవటం.. తమకు తోచినట్లుగా నిర్ణయాలు తీసుకోవటమే కాదు.. ఎవరి అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోవటానికి పెద్దగా ఇష్టపడరు. ఇలాంటి తీరు ప్రధాని మోడీలోకాస్తంత ఎక్కువే. అలాంటి తీరుతో లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని ఎంత చెప్పినా వినని మోడీ మాష్టారికి ఇప్పుడు తత్త్వం బోధ పడినట్లుగా చెబుతున్నారు.
తాము తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై పంజాబ్ రైతులు నిరనసకు ప్లాన్ చేయటం.. భారీ ఎత్తున ఆందోళనకు దిగుతారన్న మాట చెబుతున్న వేళ.. వారిని బుజ్జగించి.. వారేం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే సరిపోయేది. గోటితో పోయే దానికి గొడ్డలి వరకు అన్నట్లుగా.. ఆందోళనలు పీక్స్ కు చేరుకోవటంతో పాటు.. ఇష్యూ జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయానికి విస్తరించిన వేళ కానీ మోడీ మాష్టారికి వేడి పుట్టలేదని చెప్పక తప్పదు.
సాధారణంగా ఏదైనా ఉద్యమాలు మొదలైనప్పుడు వాటిని మొగ్గదశలో తుంచేసే అవకాశాలు బోలెడన్ని ఉంటాయి. అధికారంలో చేతిలో ఉన్నప్పుడు ఆందోళనల్ని.. నిరసనల్నికంట్రోల్ చేస్తామన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మోడీ సర్కారు అందుకు మినహాయింపు కాదు. రైతుల ఉద్యమాన్ని పట్టించుకోని మోడీ సర్కారు ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి.
మోడీ సర్కారుకు వ్యతిరేకంగా రైతులు గళం విప్పటం.. వారి పోరాటపటిమ రాజకీయ పార్టీల్ని అలెర్టు చేసేలా చేసింది. గడిచిన ఆరేళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న మోడీ జైత్రయాత్రకు ఈ మాత్రం ఇబ్బంది కలిగించింది ఎవరూ లేరు. మోడీ విధానాల్ని కట్టడి చేసే ప్లాన్ రాజకీయ పార్టీల దగ్గర లేకపోవటంతో వారంతా చేష్టలుడిగినట్లుగా ఉండిపోయారు. ఇలాంటివేళ.. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు భారీ నష్టం వాటిల్లుతుందన్న సత్యాన్ని ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పటమే కాదు.. తమ డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పటానికి వారు వినూత్నంగా చేపట్టిన నిరసనకు తాజాగా రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.
దీనికి తోడు.. అన్నదాతలు చేస్తున్న ఉద్యమానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని భారతీయులతో పాటు.. విదేశీయులు సైతం అండగా నిలుస్తున్నారు. దీంతో.. మోడీ ఇమేజ్ ఇప్పుడు డ్యామేజ్ అవుతోంది. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న రైతులు తెరమీదకు తీసుకొచ్చిన డిమాండ్ల మీద సానుకూలంగా స్పందిస్తామన్న హామీ ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ.. తాము తెచ్చిన చట్టాల్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని.. మార్పులు చేసే అవకాశమే లేదని మొండిగా చెప్పేశారు.
ఈ రోజున ఆందోళనలు తీవ్రతరం కావటంతో పాటు.. కేంద్రం మీద పెద్ద ఎత్తున ఒత్తిళ్లు మొదలుకావటంతో అత్యవసర భేటీలు.. కేబినెట్ సమావేశాల్ని నిర్వహించుకోవాల్సిన దుస్థితి. ఈరోజున మోడీ సర్కారు వెనక్కి తగ్గినా నష్టమే.. తగ్గకున్నా నష్టమే. ఇలాంటి పరిస్థితికి కారణం మోడీ అండ్ కోనే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయ చట్టాల్లో మార్పులు తెస్తే.. అది రైతుల విజయంగా మారతుుంది అలా అని.. ఊరకుండిపోతే ఆందోళనలు మరింత పెరగటం ఖాయం. అప్పుడు మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఇప్పుడున్న ఏకైక పరిష్కారం.. కాస్త తగ్గి..ఆందోళన చేస్తున్న వారి డిమాడ్లను ఈ దశలో అయినా సానుకూలంగా స్పందిస్తే మోడీ సర్కారుకు మేలు జరుగుతుంది. అందుకు భిన్నంగా మొండితనాన్ని కంటిన్యూ చేస్తే మాత్రం.. మొదటికే మోసం రావటం ఖాయమన్న విషయాన్ని మోడీ గుర్తిస్తే మంచిదంటున్నారు.