Begin typing your search above and press return to search.

జగన్ మెచ్చని నంబర్ పెద్దదే.... నవంబర్ డేంజర్ వారికే...?

By:  Tupaki Desk   |   9 Sep 2022 12:30 PM GMT
జగన్  మెచ్చని నంబర్ పెద్దదే.... నవంబర్ డేంజర్ వారికే...?
X
ఏపీలో కొత్త మంత్రులు చార్జి తీసుకుని అయిదు నెలల కాలం గడచింది. అయితే ఇందులో ఎందరు మంత్రులు జనాలలో రిజిష్టర్ అయ్యార్ అంటే అది మిలియన్ డాలర్ ప్రశ్న. ఏపీలో పాతిక మంత్రి మంత్రులు ఉన్నారు. అయితే వారి శాఖలు ఏంటి అని చెప్పమన్నా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారి కూడా తడబడతారు. దీనికి కారణం ఏంటి అంటే చాలా మంది మంత్రులు పనిమంతులుగా ఇంకా జనాలలో తమదైన ముద్ర వేసుకోలేదు అని ప్రచారం సాగుతోంది.

కొందరు మంత్రులు అయితే ఇంకా తమ శాఖ గురించి తెలుసుకునే పనిలోనే ఉన్నారు. ఎన్నికలు చూస్తే ఏణ్ణర్ధంలోకి వచ్చేశాయి. మంత్రులు పట్టు సాధించేవరకూ ప్రతిపక్షం చూస్తూ ఊరుకోదు కదా. వారు విమర్శలు చేస్తూ ఉంటాయి. అలాగే సమస్యలు కూడా ఆగవు కదా. అవి ఎప్పటికపుడు పుట్టుకువస్తూనే ఉంటాయి. దాంతో మంత్రులు దీన్ని టార్గెట్ చేయాలో తెలియక సతమతమవుతున్నారు అని అంటున్నారు. దీని మీద జగన్ కి అందిన నివేదికలు ఆధారంగా మంత్రి వర్గ సమావేశంలో సీరియస్ గానే రియాక్ట్ అయ్యారని, కొందరికి క్లాస్ కూడా తీసుకున్నారని ప్రచారం సాగింది.

ఇక జగన్ మంత్రుల పనితీరు మీద ఎప్పటికపుడు చేయిస్తున్న సర్వే నివేదికలు ఆయన వద్ద ఉన్నాయి. అందులో పాతిక మందిలో తొమ్మిది మంది మాత్రమే జగన్ మార్క్ పారామీటర్లకు దగ్గరగా ఉన్నారని తేలిందట. వారే తమ పనితీరుతో పాటు ముఖ్యమంత్రి కోరిన విధంగా తమ సత్తా చూపిస్తున్నారు అని అంటున్నారు.

అలా ముఖ్యమంత్రి మెచ్చిన మంత్రుల జాబితాలో సీనియర్లుగా ఉన్న బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, విడుదల రజని, సీదరి అప్పలరాజు, గుడివాడ అమరనాధ్, చెల్లుబోయిన గోపాలక్రిష్ణ, మేరుగ నాగార్జున, విడదల రజని ఉన్నారని తెలుస్తోంది. వీరి విషయంలో జగన్ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా భోగట్టా. వీరు తమ శాఖల పట్ల బాగానే వ్యవహరిస్తున్నారు అని నివేదికలో చెబుతున్నారు.

వీరు కాకుండా మిగిలిన పదహారు మంది మంత్రుల విషయంలో జగన్ అసంతృప్తిగానే ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా హోం మంత్రిగా ఉన్న తానేటి వనిత అప్పట్లో ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో విషయంలో ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా మీడియా వద్దకు రావడం పట్ల కూడా అధినాయకత్వానికి అసంతృప్తి ఉంది అంటున్నారు. ఎలాంటి హోం వర్క్ చేయకుండా కొందరు మంత్రులు మీడియాను ఫేస్ చేస్తున్నారు అని అంటున్నారు.'

ఇక జగన్ కి ఎంతో ఇష్టమైన సన్నిహితుడైన మంత్రిగా పేరు తెచ్చుకున్న ఆదిమూలపు సురేష్ విద్యా శాఖ నుంచి పురపాల శాఖకు మారిన దగ్గర నుంచి పనితీరు బాగా అసంతృప్తిగా ఉందని అంటున్నారు. ఆయన ఫలానా అంశం మీద మాట్లాడాలని సీఎం ఆఫీస్ నుంచి సందేశం పంపించినా కూడా లైట్ తీసుకుంటున్నారు అన్న టాక్ కూడా ఉంది అంటున్నారు. దాంతో మంత్రి వర్గ సమావేశంలో ఆయనకు ప్రత్యేకంగా సీఎం జగన్ చెప్పాల్సింది చెప్పారని అంటున్నారు.

అదే విధంగా చూస్తే గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు అయితే తమ పనితీరుతో పూర్తిగా నిరాశపరుస్తున్నారు అన్న నివేదికలు ఉన్నాయట. ఇక రాయలసీమకు చెందిన మంత్రులు అయితే ప్రభుత్వాన్ని పార్టీని పక్కన పెట్టేసి తమ సొంత వ్యాపారాలలో మునిగితేలుతున్నారని కూడా సమాచారం ఉందిట. దీంతో సీఎం అసలు ఏం జరుగుతోంది. ఎంతో నమ్మకంతో మంత్రివర్గాన్ని విస్తరించామని, కానీ ఫలితాలు వేరేగా ఉంటున్నాయని మధనపడుతున్నారట.

దాంతో కనీసంగా మూడు నుంచి మొదలుపెడితే ఆరుగురు మంత్రులకు నవంబర్ లో జరిగే పునర్ వ్యవస్థీకరణలో ఉద్వాసన ఖాయమని అంటున్నారు. ఇక కీలకమైన శాఖలను కూడా మార్చి పట్టున వారికి ఇవ్వాలని చూస్తున్నారుట. ఈ నేపధ్యంలో సీఎం గురి ఎవరి మీద అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఏది ఏమైనా కొత్త మంత్రులు కొందరు తమకు ఎన్నికల దాకా సేఫ్ అని భావించారు. అది తప్పు అని నవంబర్ విడత పునర్ వ్యవస్థీకరణ రుజువు చేయబోతోంది అంటున్నారు.

ఇక పదహారులో ఆరుగురిని తప్పించి కొత్తవారికి చాన్స్ ఇచ్చి మిగిలిన పది మందికి కూడా సున్నితమైన హెచ్చరికలు చేస్తారని చెబుతున్నారు. వారిలో కూడా ఎవరైనా తీరు మార్చుకోకపోతే కొత్త ఏడాది మొదట్లో సైతం పునర్ వ్యవస్థీకరణ చేసినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.