Begin typing your search above and press return to search.

మన చేతి గోర్లే చెబుతాయట.. మన ఆరోగ్య సమస్యలేంటో!

By:  Tupaki Desk   |   26 Jan 2021 8:00 PM IST
మన చేతి గోర్లే చెబుతాయట.. మన ఆరోగ్య సమస్యలేంటో!
X
ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది. అది ఏదో ఒక టైంలో బయట పడుతుంటుంది. ఎటువంటి సమస్యలతో బాధ పడుతున్నది తెలుసు కోవడం కోసం చాలా మంది రకరకాల వైద్య పరీక్షలు చేయించు కుంటూ ఉంటారు. అయితే అన్ని రకాల పరీక్షలు చేయించు కోవాల్సిన అవసరం లేదు. మన చేతి వెళ్లే మన అనారోగ్య సమస్యలు ఏంటో చెబుతాయట.కొందరి చేతి వేళ్ళ గోర్లపై అర్ధచంద్రాకారంలో ఒక ఆకారం ఉంటుంది. దీనిని లునులా అంటారు. లునులా అంటే లాటిన్ భాషలో స్మాల్ మూన్ అని అర్థం.

గోరు కింద భాగంలో ఉండే లునులా పై ఎవరికీ పెద్దగా అవగాహన ఉండదు. ఈ లునులా శరీర భాగాల్లో అతి సున్నితమైంది. ఇది దెబ్బ తింటే గోర్లు పెరగడం ఆగిపోతుంది. మన గోరు రంగులను బట్టి కూడా మనం ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు కూడా తెలుసుకోవచ్చు.చేతి గోళ్ళ పై లునులా లేకపోతే వారిలో రక్త హీనత, పౌష్టికాహార లోపం వంటి సమస్యలు ఉన్నాయని అర్థమట. లునులా ఆకారం మరీ చిన్నగా గుర్తుపట్టలేనంతగా ఉంటే అజీర్తితో ఇబ్బంది పడుతున్నట్లు, వారి శరీరంలో విషపదార్థాలు ఉన్నట్లు అని తెలుసుకోవచ్చు.

లునులా మీద ఎరుపు, పసుపు రంగులో మచ్చలు ఉంటే వారికి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లు అర్థం అంట. లునులా రంగు నీలం లేదా పూర్తిస్థాయిలో తెలుపు ఉంటే వారు త్వరలో ఈ షుగర్ వ్యాధి బాధితులు కాబోతున్నారని తెలుసుకోవచ్చు. మనం ఏ ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తెలుసుకోవడానికి డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. రెగ్యులర్గా మన చేతి గొల్ల లునులాను పరిశీలిస్తే చాలని, దానిని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.