Begin typing your search above and press return to search.

ఇండియన్ టాలెంట్.. వెళ్లిపోతోంది

By:  Tupaki Desk   |   21 Nov 2018 12:07 PM GMT
ఇండియన్ టాలెంట్.. వెళ్లిపోతోంది
X
మేధో వలస అన్నది గత కొన్ని దశాబ్దాల్లో ఇండియాకు పెద్ద సమస్యగా మారింది. మన దేశంలో పుట్టి మనదేశంలో పెరిగి.. ఇక్కడే చదువుకుని.. ఇక్కడే ఉద్యోగాలు సంపాదించి.. ఆ తర్వాత దేశం విడిచి వెళ్లిపోతున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి అక్కడే స్థిరపడిపోతున్నారు. కొందరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి.. ఆ తర్వాత అక్కడే ఉద్యోగాలు తెచ్చుకుని సెటిలైపోతున్నారు. గత కొన్నేళ్లలో ఈ ఒరవడి మరింత పెరిగింది. తాజాగా బయటికి వచ్చిన ఓ సర్వే ప్రకారం ఇండియాలో జనాభా.. సంపద అంతకంతకూ పెరుగుతున్నట్లే.. మేధో వలస కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. 2017లో విదేశాల్లో స్థిరపడిన భారతీయుల సంఖ్య 1.7 కోట్లుగా ఉంది. 1990 నాటితో పోలిస్తే ఈ సంఖ్య 143 శాతం అధికం కావడం గమనార్హం.

ఈ కాలంలో ఇండియాలో తలసరి ఆదాయం 522 శాతం పెరిగింది. 1,134 డాలర్ల నుంచి 7,055 డాలర్లకు చేరుకుంది. దీన్ని బట్టి విదేశాలకు వెళ్లడం ద్వారా భారతీయుల ఆదాయం ఎంతో పెరుగతోందని అర్థమవుతోంది. స్వదేశంలో వారు ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లభించట్లేదు. మరోవైపు అన్ స్కిల్డ్ వర్కర్ల వలస గతంతో పోలిస్తే చాలా తగ్గిపోయింది. 2011లో ఆ సంఖ్య 6 లక్షల 37 వేలుగా ఉంటే.. గత ఏడాది ఆ సంఖ్య 3 లక్షల 91 వేలకు పడిపోయింది. అంటే దాదాపు సగానికి సగం వలసలు తగ్గిపోయాయి. అన్ స్కిల్డ్ వర్కర్లు ప్రధానంగా మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్తుంటారు. ఐతే అక్కడ రోజు రోజుకూ వలస జనాల బతుకు దుర్భరంగా మారిపోతుండటం.. వీసా ఇతర సమస్యల వల్ల ఈ వలసలు తగ్గిపోతున్నాయి. ఐతే ఉన్నత చదువులు చదివిన చాలామంది విదేశాలకు వెళ్లడానికి.. అక్కడ స్థిరపడటానికే మొగ్గు చూపుతుండటంతో మేధో వలస భారత్ కు రాను రాను పెద్ద సమస్యగా మారుతోంది.