Begin typing your search above and press return to search.

ఆర్థర్ జైలు: సెలబ్రెటీల జైలు జీవితానికి సెంట్రల్ హాలు

By:  Tupaki Desk   |   11 Oct 2021 6:00 AM GMT
ఆర్థర్ జైలు: సెలబ్రెటీల జైలు జీవితానికి సెంట్రల్ హాలు
X
కరుడుగట్టిన ఉగ్రవాదులు, దేశద్రోహులు, మాఫియా డాన్ లు కాలం గడిపిన ‘ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలు (ముంబై సెంట్రల్ జైలు) కు గొప్ప చరిత్రనే ఉంది. ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, అతడితోపాటు రేవ్ పార్టీలో పాల్గొన్న బిగ్ షాట్స్ కొడుకులు ఉంటున్నారు. ముంబైలోని ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలు పేరు చెబితే చాలా మంది గుర్తుకు వచ్చేస్తారు.

ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలును ముంబై సెంట్రల్ జైలు అని కూడా పిలుస్తారు. 1926లో బ్రిటీష్ అధికారులు ఆర్థర్ రోడ్డు జైలును నిర్మించారు. రెండు ఎకరాల్లో నిర్మించిన ఈ జైలును 1976లో కేంద్రకారాగారంగా ప్రకటించారు. ఆర్థర్ రోడ్డు జైలులో 800 మంది ఖైదీలు ఉండటానికి అవకాశం ఉంది. 2020లో 8 కొత్త బ్యారెక్ లు నిర్మించడంతో ఇప్పుడు అదనంగా 200 మంది ఖైదీలు ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది.

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్ ఇదే ఆర్థర్ రోడ్డు జైల్లో శిక్ష అనుభవించాడు. ఇదే జైల్లో శిక్ష అనుభవించిన సంజయ్ దత్ తర్వాత బయటకు వచ్చాడు. మాఫియా డాన్ చోటా రాజన్ ను కూడా తాత్కాలికంగా మొదట ఇదే ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైల్లో పెట్టారు. ప్రస్తుతం చోటా రాజన్ తీహార్ సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు.

ఇక 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అరెస్ట్ అయిన పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ కూడా ఇదే ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. కసబ్ ను ఇదే జైలులో విచారణ చేసి దోషిగా తేల్చారు.

1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో నిందితుడైన అబుసలేం కూడా ఇదే ఆర్థర్ రోడ్డు జైల్లో ఉన్నాడు. అరుణ్ గౌలి, ముస్తఫా దోసా లాంటి క్రిమినల్స్ ఎందరికో ఈ జైలు అడ్డా. ఉగ్రవాదులు, మాఫియా డాన్ లు, క్రిమినల్స్ ఉన్న ఈ జైల్లోనే ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఉంటున్నాడు. అలాంటి ఆర్థర్ రోడ్డు జైలు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.

దేశంలో డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారికి ఇప్పుడు ఆర్థర్ జైలు ఆవాసంగా మారుతోంది.. డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ సినీ రంగాన్ని కుదిపేస్తుండగా ఇండస్ట్రీకి చెందిన ప్రముకులకు ఈ కేసుతో సంబంధాలున్నట్లు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇటీవల షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పోలీసులకు పట్టుబడడంతో ఎన్సీబీ అధికారులు విచారణను మరింత పటిష్టం చేశారు. ఇందులో ఉన్నవారెంతటివారైనా పట్టుకుంటామని ఎన్సీబీ చీఫ్ సమీర్ వాఖండే అంటున్నారు

ముంబైలోని క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీ చేసుకొని దొరికిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ దొరకకపోవడంతో ఆర్థర్ జైలుకు తరలించారు. క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ చేసుకుంటూ డ్రగ్స్ తీసుకొని దొరికిన షారుఖ్ ఖాన్ కుమారుడు అడ్డంగా దొరికిపోయాడు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్టు చేసిన ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను ముంబై కోర్టు తాజాగా తిరస్కరించింది. ఇదే స్టింగ్ ఆపరేషన్‌లో నిర్బంధించిన అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచా బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు తిరస్కరించి గట్టి షాక్ ఇచ్చింది. వీరిని కూడా ఇదే జైల్లో ఉంచారు.