Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ కి అనుమతి ఇవ్వండి..కేంద్రానికి సీఎం వినతి!

By:  Tupaki Desk   |   17 Nov 2020 9:20 PM IST
లాక్ డౌన్ కి అనుమతి ఇవ్వండి..కేంద్రానికి సీఎం వినతి!
X
కరోనా మహమ్మారి విజృంభణ భారీగా పెరిగిపోతున్న సమయంలో మార్చి చివర్లో కేంద్రం , అన్ని రాష్ట్రాల అనుమతులతో దేశంలో సంపూర్ణ లాక్ డౌన్ ను విధించింది. అయితే, ఆ తర్వాత కరోనా వైరస్ వేగం పుంజుకోవడం , ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమైన అలాగే లాక్ డౌన్ ను కొనసాగించి , ఆ తర్వాత లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపులు ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం మళ్లీ పాత రోజులే ఉన్నాయి. అయితే , ఇప్పటికైనా కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపోయిందా అంటే అది లేదు. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ సందర్భంలో ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి ఓ వినతి పంపాలనే ఆలోచనలో ఉంది.

ఢిల్లీ లో మళ్లీ కరోనా మహమ్మారి జోరు చూపిస్తున్న నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి మార్కెట్ ప్రాంతాల్లో తిరిగి లాక్‌‌డౌన్ విధించేందుకు అనుమతించాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపనుంది. ఈ విషయాన్ని సీఎం కేజ్రీవాల్ స్వయంగా వివరించారు. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నందున, కేంద్ర ప్రభుత్వానికి జనరల్ ప్రపోజల్ ఒకటి పంపుతున్నామని తెలిపారు. నిబంధనలు పాటించని ప్రాంతాలు తిరిగి కరోనా హాట్ ‌స్పాట్ ‌గా మారే అవకాశాలున్నాయని... పరిస్థితి అనివార్యతను బట్టి అలాంటి మార్కెట్లలో మళ్లీ లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. దీంతో పాటు తక్షణం 750 ఐసీయూ పడకలు పెంచడం ద్వారా ఢిల్లీ ప్రజలకు కేంద్రం సాయంగా నిలిచిందని సీఎం కృతజ్ఞతలు చెప్పారు.

ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం నిబంధనలను పాటించాలని సీఎం కోరారు. ఇక వివాహాది కార్యక్రమాలకు 200 మందిని అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంలో మార్పులు చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను కోరింది. వివాహ కార్యక్రమాలకు 50 మందిని మాత్రమే అనుమతించాల్సిందిగా సూచించింది. కొద్దిరోజుల నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. ఢిల్లీలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనితో ఈ ప్రతిపాదనను సీఎం కేజ్రీవాల్ తీసుకువచ్చారు. ఇక దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,74,291 కి చేరింది. మృతుల సంఖ్య 1,30,519 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 82,90,371 మంది కోలుకున్నారు. 4,53,401 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.