Begin typing your search above and press return to search.
గుజరాత్ ను టార్గెట్ చేస్తున్న ఆప్!
By: Tupaki Desk | 8 Aug 2022 5:21 AM GMTగుజరాత్ లో తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టడమే టార్గెట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరచూ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. వచ్చే డిసెంబర్ లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో హిమాచల్ ప్రదేశ్ కన్నా ఎక్కువగా గుజరాత్ మీదే కేజ్రీవాల్ కన్నేశారు.
గురజాత్ లో అనేక సామాజికవర్గాలున్నప్పటికీ ప్రధానంగా గిరిజనుల పైనే దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. తాజాగా వడోదరలో పర్యటించిన కేజ్రీవాల్ గిరిజనులకు అనేక హామీలిచ్చారు.
ఆప్ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ఐదోషెడ్యూల్ ను గిరిజనుల కోసం అమలు చేస్తుందని, పంచాయితీరాజ్ చట్టాన్ని గిరిజన ప్రాంతాల్లో అమలు చేస్తామన్నది ప్రధానం. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ చీఫ్ గా ముఖ్యమంత్రి స్థానంలో గిరిజనులకే ఆ పదవిని అప్పగిస్తామన్నారు.
ఆప్ అధికారంలోకి రాగానే ప్రతి గిరిజన గ్రామంలో ఒక పాఠశాల, ఒక మొహల్లా క్లినిక్ లను ఏర్పాటు చేస్తామన్న ది కీలకమైనది. ఎందుకంటే ఆప్ కు జాతీయ స్ధాయిలో మంచి పేరు రావటానికి విద్యా, వైద్యంపై ఎక్కువ దృష్టి పెట్టడమే. స్కూళ్ళు, మొహల్లా క్లినిక్కులను ఢిల్లీలో తెరవటం వల్ల చాలామంది ఎగువ, మధ్య తరగతి జనాలతో పాటు పేదలకు కూడా సౌలభ్యంగా ఉంటోంది. గిరిజనులకు పక్కా ఇళ్ళు కూడా కట్టిస్తామని హామీ ఇచ్చారు.
నిజానికి దశాబ్దాలుగా అధికారంలోనే ఉంటున్నప్పటికీ గిరిజనుల సమస్యలను బీజేపీ ప్రభుత్వం పరిష్కరించలేదనే ఆరోపణలు ఎక్కువగానే ఉన్నాయి. దీనివల్లే కేజ్రీవాల్ ప్రధానంగా గిరిజనుల సమస్యలపైనే మాట్లాడుతున్నారు. జనాలు గుజరాత్ లో కాంగ్రెస్ ను నమ్మటం మానేసి చాలా సంవత్సరాలవుతోంది.
గుజరాత్ లో ఆప్ కు కావాల్సినంత స్పేస్ ఉంది. ఈ విషయాన్ని గమనించారు కాబట్టే అరవింద్ గుజరాత్ పై కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పేందుకు లేదు. అయితే పంజాబ్ లో మాదిరే ముందు కొన్ని సీట్లు తెచ్చుకున్నా చాలనే ప్రణాళిక స్పష్టంగా తెలుస్తోంది. మరి జనాలు ఏమిచేస్తారో చూడాలి.