Begin typing your search above and press return to search.

అరవింద్ కేజ్రివాల్... కొత్త ఎంట్రీలో సంచలన స్కీంలు

By:  Tupaki Desk   |   1 July 2021 12:30 AM GMT
అరవింద్ కేజ్రివాల్... కొత్త ఎంట్రీలో సంచలన స్కీంలు
X
వచ్చే ఏడాది మార్చిలో జరగబోతున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై అరవింద్ కేజ్రీవాల్ కన్ను పడినట్లుంది. వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠంపై కూర్చున్న ఆప్ జాతీయ పార్టీ అధ్యక్షుడు, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంచి పాలననే అందిస్తున్నట్లు భావించాలి. ఎందుకంటే కేజ్రీవాల్ ప్రజా వ్యతిరేక పాలన అందిస్తున్నట్లు ఎక్కడా ఆరోపణలు వినిపించటంలేదు. అలాగే సీఎంపై ఎక్కడా అవినీతి ఆరోపణలు కూడా లేవు. అరవింద్ కున్న సమస్యంతా కేంద్రప్రభుత్వమే.

నరేంద్రమోడి, అమిత్ షా అండ్ కో ను చావుదెబ్బ కొట్టి బంపర్ విజయంతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ అంటే మోడి బాగా మంటమీదున్నారు. అందుకనే స్వేచ్చగా కేజ్రీవాల్ ను పరిపాలించకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. లెఫ్ట్ నెంట్ జనరల్ (ఎల్జీ)ను ముందుపెట్టుకుని మోడి సర్కార్ కేజ్రీవాల్ ను బాగా ఇబ్బందులు పెడుతోంది. ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఢిల్లీని అరవింద్ బాగానే పరిపాలిస్తున్నట్లు లెక్క.

ఇలాంటి కేజ్రీవాల్ కు పంజాబ్ రాష్ట్రంపై కన్నుపడింది. 2014 ఎన్నికల్లోనే పంజాబ్ లో నాలుగు ఎంపి సీట్లను ఆప్ గెలిచింది. అయితే అక్కడి నాయకత్వంలో విభేదాల కారణంగా పార్టీ గందరగోళంలో పడిపోయింది. ఢిల్లీ పరిపాలన చూస్తునే పంజాబ్ లో పరిస్ధితులను కూడా కేజ్రీవాల్ చక్కదిద్దుకున్నట్లే కనిపిస్తోంది. అందుకనే పంజాబ్ ఎన్నికలకు సై అంటున్నారు. ఇందులో బాగంగానే పంజాబ్ ఎన్నికల్లో ఆప్ గెలిస్తే ఉచిత విద్యుత్ అని హామీఇచ్చేశారు.

ఢిల్లీలో 200 యూనిట్ల వరకు విద్యుత్ ను ఉచితంగా ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఎవరికైనా అనుమానాలుంటే ఢిల్లీలో వాకాబు చేసుకోవచ్చన్న పద్దతిలో పెద్ద ప్రకటనేచేశారు. ఇప్పటివరకు కేజ్రీవాల్ కు సీఎంగా క్లీన్ సర్టిఫికేట్ ఉంది. పైగా పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం+పార్టీలో పరిస్ధితులు గందరగోళంగా ఉంది. పార్టీలో అంతఃకలహాల వల్ల ఎన్నికల్లో ఓడిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

ఇదే సమయంలో నరేంద్రమోడిపై దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న వ్యతిరేకత పంజాబ్ బీజేపీ మీద పడటం ఖాయమనే అనిపిస్తోంది. మొన్నటి పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలను చూస్తే పంజాబా లో కూడా రిపీట్ అవుతుందనే అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో క్యాండిడేట్లను గట్టివాళ్ళను నిలబెడితే ఆప్ మంచి ఫలితం రాబట్టే అవకాశముంది. కాబట్టే కేజ్రీవాల్ రంగంలోకి దూకుతున్నట్లున్నారు. సో కేజ్రీవాల్ కు ఆల్ ది బెస్ట్ చెబుదామా ?