Begin typing your search above and press return to search.

కరోనా ప్రభావం.. విదేశీయులు రావొద్దని నిషేధం

By:  Tupaki Desk   |   9 March 2020 11:58 AM IST
కరోనా ప్రభావం.. విదేశీయులు రావొద్దని నిషేధం
X
కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే భారత్ లో అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో కేరళలో ఐదు మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మరోసారి కలకలం రేపింది. పటిష్ట చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడం అందరినీ కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే ఆందోళనతో తమ రాష్ట్రంలోకి విదేశీయులు రావొద్దని నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ముందే మంచు ప్రాంతం కావడం, చైనాకు సరిహద్దు కలిగి ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా విదేశీయులను తమ రాష్ట్రంలోకి రావొద్దని ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం కరోనా వైరస్ ‌(కొవిడ్‌-19) చైనాలో చెలరేగి ప్రస్తుతం 73 దేశాలకు పాకింది. ఈ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోకి విదేశీయుల రాకపోకలపై నిషేధం విధించింది. విదేశీయులకు అనుమతులు(పీఏపీ) ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. కరోనాకు పురుడు పోసుకున్న చైనాతో సరిహద్దును పంచుకునే అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి పీఏపీలకు ప్రవేశం అనుమతించాలని విదేశీయులు కోరుతున్నా అంగీకరించడం లేదు. తాజాగా కేరళలో ఒకేరోజు ఐదు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమై విదేశీయులకు అనుమతి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

విదేశాల నుంచి వస్తున్న వారికే వైరస్ దేశంలో వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో దీన్ని భారత ప్రభుత్వం కూడా గుర్తించి ఆ మేరకు విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. విదేశాల నుంచి వస్తున్న వారిని వైద్య పరీక్షలు చేయించి ఎలాంటి లక్షణాలు లేకుంటే దేశంలోకి అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా నివారణకు చర్యలు చేపడుతున్నారు. అవి కొంత ఫలితం కనిపిస్తోంది.