Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ కష్టాలు: బియ్యంలేక దొరికిన పామే ఆహారం
By: Tupaki Desk | 21 April 2020 7:00 AM ISTకరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చాలా మంది తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు. ఆహారం కోసం పేదలు, కూలీలు తీవ్రంగా అలమటిస్తున్నారు. ఇక బియ్యం లేక కొందరు వేటగాళ్లు ఆహారం కోసం అడవిలోకి వేటకు వెళుతున్నారు. ఏదీ కనపడితే దాన్ని చంపి తింటున్న దైన్యం వెలుగుచూసింది.
తాజాగా ఇలానే తినడానికి బియ్యం లేక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను వేటగాళ్ల బృందం చంపేసింది. అనంతరం దాని మాంసాన్ని ముక్కలుగా చేసి విందు ఏర్పాటు చేసుకున్నారు. అరటి ఆకులను పరిచి మనిషికి కొంత పాము మాంసం వేసుకొని తిన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కరోనా వైరస్ కారణంగా తమ దగ్గరున్న బియ్య అయిపోయాయని.. దీంతో ఆహారం కోసం పామును వేటాడామని ఆ ముగ్గురు వేటగాళ్లు తెలిపారు. మెడలో చచ్చిన కింగ్ కోబ్రాను వేసుకొని వీడియో లో మాట్లాడారు.
ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. వన్యప్రాణుల రక్షణ చట్టం కింద వారిపై కేసులు నమోదైందని.. ఒకరు పరారీలో ఉన్నారని తెలిపారు.
కాగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పాములు హరించిపోతున్నాయి. అక్కడి ప్రజలు పాములను వేటాడి చంపి తింటున్నారు. ఎన్నో కొత్త జాతులు కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొనుగొంటున్నారు.