Begin typing your search above and press return to search.

జైట్లీ ఎందుకు ఇన్ని వ‌రాలు ఇచ్చాడంటే...

By:  Tupaki Desk   |   1 Feb 2017 8:13 AM GMT
జైట్లీ ఎందుకు ఇన్ని వ‌రాలు ఇచ్చాడంటే...
X
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇంటా, బయటా అనిశ్చితులతోపాటు పెద్ద నోట్లను రద్దు నేపథ్యంలో జైట్లీకి అత్యంత కీలక బడ్జెట్‌ గా మారింది. డీమానిటైజేషన్ ఎఫెక్ట్ నుంచి ప్రజలు, పారిశ్రామిక వర్గాలకు ఊరట కల్పించడం ఆర్థిక మంత్రి ముందున్న అతిపెద్ద సవాలుగా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు.రైతుల కోసం ప్ర‌వేశ‌పెట్టిన ప‌లు ప‌థ‌కాల వెను రాజ‌కీయ కార‌ణాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని భావిస్తున్నారు. త్వరలో జరుగనున్న ఐదు రాష్ర్టాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులు - గ్రామీణులను ల‌క్ష్యంగా చేసుకొని ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టార‌ని భావిస్తున్నారు.

రైతులు - గ్రామీణ ప్రాంతాల ల‌క్ష్యంగా ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌త్యేక అంశాలివి

- పంటల బీమా యోజన కింద మరో 40 శాతం కవరేజ్ పెంపు

-సాగునీటి సౌకర్యం కోసం రూ. 40 వేల కోట్లతోకార్పస్ ఫండ్

-ఈ_నామ్ కేంద్రాల‌ను 240 నుంచి 500లకు పెంపు

-వ్యవసాయం కోసం ఉపాధి హామీ పథకం నిధులు

-ఉపాధి హామీ పథకానికి రూ. 48 వేల కోట్లు కేటాయింపు

-2019 నాటికి 50 వేల గ్రామపంచాయతీలు పేదరికం నుంచి బయటపడుతాయి

-వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి రంగాలకు లక్షా ఎనభై ఏడు వేల కోట్లు కేటాయింపు

-ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు రూ. 19,100 కోట్లు

-ప్రధాని ఆవాస్ యోజనకు రూ. 23 వేల కోట్లు

-గ్రామజ్యోతి యోజనకు రూ. 4,300 కోట్లు

-2019 నాటికి పేదలకు కోటి ఇండ్ల నిర్మాణం

-అంత్యోదయ యోజనకు రూ. 2,500 కోట్లు

-ముద్రా రుణాల కోసం రూ. 2 లక్షల 44 వేల కోట్లు