Begin typing your search above and press return to search.

అర‌గంట త‌ర్వాత పాత ప‌ద్ద‌తిలోకి వెళ్లిన జైట్లీ

By:  Tupaki Desk   |   1 Feb 2018 7:05 AM GMT
అర‌గంట త‌ర్వాత పాత ప‌ద్ద‌తిలోకి వెళ్లిన జైట్లీ
X
యావ‌త్ దేశాన్ని ప్ర‌భావితం చేసే ప్ర‌ముఖుల ఆరోగ్యాలు చాలా కీల‌కం. అయితే.. అలాంటి ఫిట్ నెస్ మ‌న నేత‌ల్లో త‌క్కువ‌గా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. ఒక్క‌సారి గుర్తు తెచ్చుకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్ని పాలించే చంద్రుళ్లు మొద‌లు దేశ వ్యాప్తంగా ఉన్న ప‌లువురు నేత‌లంతా ఏదో ఒక అనారోగ్య ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నార‌న్న విష‌యం గుర్తుకు రాక మాన‌దు. ఎవ‌రైనా నేత‌ను ఏదైనా కార‌ణం చేత పోలీసులు అదుపులోకి తీసుకున్నంత‌నే.. త‌మ‌కున్న అనారోగ్యాల లిస్టును ఏక‌రువు పెట్ట‌టం క‌నిపిస్తుంది.

కోట్లాదిమంది ప్ర‌జ‌ల్ని పాలించే నేత‌ల ఆరోగ్యక‌రంగా ఉంటే బాగుంటుంది. దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌న నేత‌ల ఫిట్ నెస్ విష‌యంలో అసంతృప్తి వ్య‌క్తం కాక మాన‌దు. తాజాగా పార్ల‌మెంటులో త‌న చివ‌రి పూర్తిస్థాయి బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టిన ఆర్థిక మంత్రి జైట్లీ విష‌యాన్నే చూస్తే.. ఆయ‌న త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని నిలుచొని చ‌ద‌వ‌లేని ప‌రిస్థితి.

2014 నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని చేసే ప్ర‌తిసారి కాసేపు నిలుచొని.. మిగిలింది కూర్చొని బ‌డ్జెట్ పాఠాన్ని చ‌దివే జైట్లీ.. ఈసారి అదే ప‌ని చేశారు.

ఈసారి త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగం మొద‌లైన 35 నిమిషాల వ‌ర‌కూ నిలుచునే బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని నిలుచొని చ‌దివిన జైట్లీ.. మిగిలింది మాత్రం కూర్చొనే చ‌దివారు. వెన్నునొప్పితో బాధ ప‌డుతున్న ఆయ‌న‌.. బ‌డ్జెట్ ప్ర‌సంగం మొత్తాన్ని నిలుచొని ప్ర‌సంగించ‌లేని ప‌రిస్థితి. ఈ కార‌ణంతోనే ఆయ‌న కూర్చొని చ‌దివిన‌ట్లు చెబుతున్నారు. త‌న గ‌త బ‌డ్జెట్ల‌లో మాదిరి ప‌లు సంద‌ర్భాల్లో మంచినీళ్లు తాగుతూ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని చ‌దివారు.