Begin typing your search above and press return to search.

ఆర్టిఫియల్ వోంబ్.. ఏకకాలంలో వేల గర్భాలు పెంచడం సాధ్యమే..!

By:  Tupaki Desk   |   16 Dec 2022 2:30 AM GMT
ఆర్టిఫియల్ వోంబ్..  ఏకకాలంలో వేల గర్భాలు పెంచడం సాధ్యమే..!
X
2022 నవంబర్ 15న నాటికి ప్రపంచ జనాభా 800 బిలియన్ కోట్ల మార్క్ ను చేరుకుంది. ఇప్పటికైతే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా ఉంది. అయితే 2023 ఏడాది చివరి నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించబోతుందని యూఎన్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

2050 నాటికి ప్రపంచ జనాభాలో కేవలం 8 దేశాలు మాత్రమే సగం కంటే ఎక్కువ ఉండబోతుందని యూఎన్ వరల్డ్ పాపులేషన్ అంచనా వేసింది. మిగిలిన దేశాల్లో జనాభా పెరుగుదల విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలు రాబోయే రోజుల్లో శ్రామిక శక్తి లోటును ఎదుర్కొనే అవకాశం ఉందని వెల్లడించింది.

మరోవైపు జపాన్ లాంటి దేశాల్లో జనాభా పెరుగుదల దారుణంగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం పిల్లలను కనే వారి కోసం ప్రత్యేక స్కీములను అమలు చేస్తోంది. అయితే పెరుగుతున్న ఖర్చులు.. ఉద్యోగ భారం తదితర కారణాలతో జపానీయులు పిల్లలను కనేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

అత్యధిక జనాభా కలిగిన చైనా సైతం ఇటీవల తమ దేశంలో ఒకరు ముద్దు.. ఇద్దరు వద్దు అనే నినాదాన్ని ఎత్తివేసింది. అక్కడ కూడా ఇద్దరు పిల్లలను కనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రష్యా సైతం తమ దేశంలో పది మంది పిల్లలను కని పెంచిన వారికి మదర్ హీరోయిన్ అవార్డు కింద 13 లక్ష నగదును అందజేసి ప్రోత్సహిస్తోంది.

ఈ నేపథ్యంలో జనాభా లోటు సమస్యకు చెక్ పెట్టేలా.. సంతాన లేమితో బాధపడే వారికి ఊరట కలిగించేలా ఆర్టిఫియల్ వోంబ్ ఫెసిలిటీ టెక్నాలజీని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ అందుబాటులోకి వచ్చాక ఏక కాలంలోనే వేల సంఖ్యలో గర్భాలను పెంచడం సాధ్యమవుతుందని ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్.. బయో టెక్నాలజిస్ట్ హాషీ అల్ ఘైలీ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను సైతం ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ వీడియో ప్రకారంగా.. గర్భాలను ఒక అండాకార గాజు పెట్టె(బర్తింగ్ పాడ్) లో పెంచడం జరుగుతుంది. ఇందుకోసం ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతిని వినియోగిస్తారు. ఈ పద్ధతి ద్వారా తల్లి గర్భంలో ఉండే అన్ని సదుపాయాలు అంటే న్యూట్రిషన్లు.. ఆక్సిజన్లు అందజేయడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెన్సర్లు ద్వారా బర్తింగ్ పాడ్ లోని గర్భం గుండె కొట్టుకునే వేగం.. ఉష్ణోగ్రత.. ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకుంటారు. వీటి ఆధారంగా గర్భంలోని జన్యుపరమైన సమస్యలను తెలుసుకొని వైద్యులు నివారిస్తారు.

ఎప్పటికప్పుడు బిడ్డ పెరుగుదలను అంచనా వేస్తారు. ఈ గర్భం పెరుగుదలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించేలా యాప్ లకు అనుసంధానిస్తారు. వీళ్లు కావాలనుకంటే పాటలు విన్పించడంతో పాటు ముచ్చట్లు సైతం పెట్టొచ్చు. బిడ్డను బయటకు తీయాలంటే బర్తింగ్ పాడ్ పై బటన్ నొక్కి తీసుకోవడమే. ఈ ఆర్టిఫియల్ వోంబ్ ఫెసిలిటీ ద్వారా ఒక ఏడాదిలో 30 వేల మంది శిశువులను పెంచవచ్చని హసీం తన వీడియోలో పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ అనేది జనాభా లోటును ఎదుర్కొంటున్న దేశాలకు వరంగా మారనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.