Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియా వివాదం.. మ‌రో ఆరుగురు అరెస్టు

By:  Tupaki Desk   |   10 Feb 2022 11:32 PM IST
సోష‌ల్ మీడియా వివాదం.. మ‌రో ఆరుగురు అరెస్టు
X
రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై వ్యాఖ్య‌ల కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్ప‌టికే ప‌లువురిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. తాజాగా గురువారం మ‌రో ఆరుగురు వైసీపీ అనుకూల వ్య‌క్తుల‌ను.. అరెస్టుచేశారు. న్యాయ‌మూర్తులు, న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన కేసులో వీరికి కూడా సంబంధం ఉంద‌ని అధికారులు తెలిపారు. అయితే.. తాజాగా అరెస్టు చేసిన వారిలో ఎవ‌రు ఉన్నారు? అనే విష‌యాన్ని అధికారులు వెల్ల‌డించ‌లేదు.

కానీ, సీబీఐ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. వారికి, ఈ వివాదానికి అత్యంత ద‌గ్గ‌ర సంబంధం ఉంద‌ని.. వారిని కోర్టు ముందు హాజ‌రు ప‌రుస్తామ‌ని తెలిపారు. గ‌తంలో ఈ కేసుల‌కు సంబంధించి కీల‌క‌మైన అవుతు శ్రీధ‌ర్‌రెడ్ఇ, జ‌ల‌గం వెంక‌ట స‌త్య‌నాయార‌ణ‌, శ్రీనాథ్‌, శ్రీధ‌ర్‌, అజ‌య్ అమృత్‌, ద‌ర్శి కిశోర్‌రెడ్డి, లింగా రెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి, ధ‌నిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్‌ల‌ను అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే.

సుదీర్ఘ‌కాలం వీరంతా కూడా జైల్లో ఉన్నారు. త‌ర్వాత‌.. వీరికి బెయిల్ వ‌చ్చింది. అయితే.. వీరిపై సీబీఐ త‌ర్వాత‌.. చార్జ్ షీట్లు దాఖ‌లు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌ను హైకోర్టు అనేక సంద‌ర్భాల్లో కొట్టేసింది. దీంతో వైసీపీ సానుభూతి ప‌రులు.. కొంద‌రు నేత‌లు.. న్యాయ‌మూర్తుల‌కు, కోర్టుకు.. వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేశారు. దీంతో రాష్ట్ర హైకోర్టులో కేసులు దాఖ‌ల‌య్యాయి. ఏకంగా రిజిస్ట్రారే.. దీనిని దాఖ‌లు చేశారు. ఇక‌, రాష్ట్ర సీఐడీ విచార‌ణ జ‌రిపినా.. ఫ‌లితం క‌నిపించ‌క పోవ‌డంతో హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ద‌ర్యాప్తు చేసింది.

సీబీఐ తన దర్యాప్తులో భాగంగా అరెస్టులు చేసింది. నవంబర్ 11, 2020న 16 మంది నిందితులపై సీబీఐ కేసు నమోదు చేసి, ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర సీఐడీ నుంచి 12 ఎఫ్‌ఐఆర్‌ల దర్యాప్తును చేపట్టింది.

కోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదులపై అసలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన కొన్ని కోర్టు తీర్పులను అనుసరించి, రాష్ట్రంలో సోష‌ల్ మీడియా పోస్టులను వైరల్ చేసిన‌ కీలక సిబ్బంది ఉద్దేశపూర్వకంగా న్యాయమూర్తులు మరియు న్యాయవ్యవస్థపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లలో అవమానకరమైన పోస్ట్‌లు చేశారని ఎఫ్‌ఐఆర్‌లలో ఆరోపించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఇతర పబ్లిక్ డొమైన్‌ల నుండి అభ్యంతరకరమైన పోస్ట్‌లను తీసివేయడానికి కేసు నమోదు చేసిన తర్వాత CBI కూడా చర్య ప్రారంభించింది. సీబీఐ కేసు నమోదు చేసిన తర్వాత ఇంటర్నెట్‌లో చాలా పోస్టులు, ఖాతాలు తొలగించారు.

ఇక‌, ఈ కేసులో సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాంల‌ను కూడా హైకోర్టు చేర్చింది. ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్ ల‌ను ప్ర‌తివాదులుగా చేర్చిన హైకోర్టు.. ఆయా పోస్టుల‌ను తొల‌గించ‌క‌పోతే.. ధిక్కార చ‌ర్య‌లు తీసుకునేందుకు కూడా వెనుకాడేది లేద‌ని.. హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలో రెండు రోజుల కింద‌ట‌.. జ‌రిగిన విచార‌ణ‌లో తాము పోస్టుల‌ను ఖ‌చ్చితంగా తొల‌గించేశామ‌ని.. ఇంకా ఏమైనా ఉంటే.. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు.. ఆయా మాధ్య‌మాల్లో పోస్టులు తొల‌గించిందీ.. లేనిదీ చూసి..త మ‌కు నివేదిక‌స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.