Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ సీనియర్ నేతకు అరెస్ట్ వారెంట్

By:  Tupaki Desk   |   22 Dec 2019 11:02 AM GMT
కాంగ్రెస్ సీనియర్ నేతకు అరెస్ట్ వారెంట్
X
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ చిక్కుల్లో పడ్డారు. కేరళకు చెందిన శశిథరూర్ కు స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ చేయడం కలకలం రేపింది.

శశిథరూర్ ఇటీవల రాసిన ‘ద గ్రేట్ ఇండియన్ నావెల్ ’ పుస్తకం వివాదాస్పదమైంది. 1989లో రాసిన ఈ పుస్తకం అప్పట్లోనే సంచలనంగా మారింది.అందులో హిందూ మహిళలను అవమానపరిచాడని ఆయనపై కేసు దాఖలైంది. ఈ కేసులోనే అరెస్ట్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది.

అరెస్ట్ వారెంట్ పై ఆయన కానీ, ఆయన లాయర్ కానీ హాజరు కానందున కోర్టు వారెంట్ జారీ చేసింది.

దీనిపై శశిథరూర్ స్పందించారు. తమకు వారెంట్ జారీ అయిందని తెలియదని.. మీడియా ద్వారానే తెలిసిందని.. కోర్టు వారు తేదీతో సహా పేర్కొని మరో నోటీసు జారీ చేస్తే విచారణకు హాజరు అవుతామని తెలిపారు.