Begin typing your search above and press return to search.

నీరవ్‌ మోదీ అరెస్ట్‌ కు రంగం సిద్ధం

By:  Tupaki Desk   |   18 March 2019 11:13 PM IST
నీరవ్‌ మోదీ అరెస్ట్‌ కు రంగం సిద్ధం
X
మన టైమ్‌ బాగోలేనప్పడు అన్నీ మూసుకుని కూర్చోవాలి. మనల్ని ఎవడం ఏం చేస్తాడులే అని అనుకుంటే రోడ్డు మీదకు వచ్చి డ్యాన్సులేస్తే.. జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది. పాపం నీరవ్‌ మోదీ ప్రస్తుతం ఇలాంటి సిట్యువేషన్‌ లో ఫేస్ చేస్తున్నాడు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుని దాదాపు రూ.13 వేల కోట్లకు ముంచేసి లండన్‌ పారిపోయాడు నీరవ్‌. లండన్ అయితే వెళ్లాడు కానీ అక్కడ తాను ఉన్నట్లు బయటి ప్రపంచానికి తెలీకుండా చాలా జాగ్రత్తపడ్డాడు. ఇన్నితెలిసినవాడు కామ్‌ గా ఉండిపోవాలి. కానీ రెండు వారాల క్రితం అనవసరంగా బయటకి వచ్చాడు. అంటే టెలిగ్రాఫ్‌ రిపోర్టర్‌ చూసి గుర్తుపట్టేశాడు. సవాలక్ష ప్రశ్నలతో మోడీని ఇరుకున పెట్టాడు. ఇది కాస్తా అన్ని చానెల్స్‌ లో వచ్చేసరికి లండన్ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది

మరోవైపు నీరవ్‌ మోడీని అరెస్ట్ చెయ్యాలని ఎప్పటినుంచో అనుకుంటున్న భారత్‌ కు మంచి ఆయుధం దొరికింది. అతడ్ని అరెస్ట్ చేసేందుకు లండన్ కోర్టుని ఆశ్రయించింది. అయితే.. ఈ విషయాన్ని ముందుగానే కనిపెట్టిన నీరవ్‌.. లండన్ కోర్టులో పిటీషన్‌ వేశాడు. ఈ పిటీషన్‌ ని లండన్‌ కోర్టు కొట్టేసింది. డబ్బులు దొబ్బేసి లండన్‌ వచ్చింది కాక.. అరెస్ట్ చేయకూడదంటా పిటీషన్ వేస్తావా అంటూ అక్షింతలు వేసింది. దీంతో.. ఇప్పుడు మన అధికారులకు నీరవ్‌ మోదీని అరెస్ట్‌ చేసేందుకు మంచి అవకాశం దొరికినట్లు అయ్యింది.