Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి నారాయణ అరెస్టులో ట్విస్టులే ట్విస్టులు!

By:  Tupaki Desk   |   10 May 2022 9:34 AM GMT
మాజీ మంత్రి నారాయణ అరెస్టులో ట్విస్టులే ట్విస్టులు!
X
ఏపీ మాజీ మంత్రి నారాయణను ఏపీ అధికారులు హైదరాబాద్ కు వచ్చి ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కొండాపూర్ లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నప్పటికీ మీడియాకు ఆ సమాచారం ఆలా ఆలస్యంగా బయటకు వచ్చింది.

ఇదిలాఉంటే.. ఏపీ అధికారులు నారాయణను అదుపులోకి తీసుకొని ఏపీకి బయలుదేరిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. 2014 చంద్రబాబుప్రభుత్వంలో కీలకభూమిక పోషించటమే కాదు.. ఏపీ రాజధాని అమరావతి ఎపిసోడ్ మొత్తంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన్ను అరెస్టు చేసిన విషయానికి వస్తే.. టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లుగా వార్తలు రావడం , మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ అదే విషయాన్ని ప్రస్తావించటం తెలిసిందే. ఆయన్ను అరెస్టు చేసిన అధికారులు ఏపీకి తీసుకెళ్లటం తెలిసిందే. ఇక్కడే అనూహ్య ట్విస్టు చోటు చేసుకుంది. సాధారణంగా ఒక పెద్ద సంస్థలో ఏదైనా అక్రమం జరిగితే.. దానికి బాధ్యులైన వారిని అరెస్టు చేస్తారే తప్పించి.. యజమానిని అదుపులోకి తీసుకోవటం ఎక్కడా ఉండదు.

మరింత వివరంగా చెప్పాలంటే.. ఒక ఎస్ఐ అవినీతి కేసులో పాలు పంచుకున్నాడని అనుకుందాం. అప్పుడు ఆ ఎస్ఐను అరెస్టు చేస్తారే కానీ.. పోలీస్ బాస్ అయిన డీజీపీని అదుపులోకి తీసుకోరు కదా? అలాంటప్పుడు ఎక్కడో చిత్తూరు జిల్లాలో జరిగిన పేపర్ లీకేజీకి హైదరాబాద్ లోని సదరు విద్యా సంస్థల యజమానిని అదుపులోకి తీసుకోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి వేళలోనే అనూహ్య ట్విస్టు చోటు చేసుకుంది.

టన్త్ క్లాస్ ప్రశ్నాపత్రం లీకేజీలో అరెస్టు చేసినట్లు అందరు అనుకున్నారు .. గంట వ్యవధిలో అసలు విషయం బయటకు వచ్చింది . అమరావతి రాజధాని భూముల కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేసుకొని.. సీఆర్డీఏలో నారాయణ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును కేసుగా నమోదు చేసిన అధికారులు ఆయన్ను తాజాగా అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు మాజీ మంత్రి నారాయణను ల్యాండ్ పూలింగ్ కేసులో అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఆయన్ను అదుపులోకి తీసుకున్న అధికారులు శంషాబాద్ దాటే ప్రయత్నం చేయగా.. తెలంగాణ పోలీసులు అడ్డుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు నారాయణ అరెస్టు.. తరలింపుపై చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారులు ఏ నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి మాజీ మంత్రి నారాయణ అరెస్టు ఎపిసోడ్ ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసున్నట్లు చెబుతున్నారు.