Begin typing your search above and press return to search.

ఎన్నారై సజీవదహనం.. కలకలం

By:  Tupaki Desk   |   31 May 2019 11:37 AM IST
ఎన్నారై సజీవదహనం.. కలకలం
X
అమెరికాలోని అధ్యక్షుడి అధికారిక నివాసం అదీ.. దాన్నే వైట్ హౌస్ అంటారు. అలాంటి చోట ఓ వ్యక్తి సజీవ దహనం కలకలం రేపింది. అయితే ఇతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడు భారత్ కు చెందిన అర్నవ్ గుప్తా(33)గా పోలీసులు గుర్తించారు.

ఇండియాకు చెందిన అర్నవ్ గుప్తా అమెరికాలోని మేరీలాండ్ లో నివసిస్తున్నాడు. బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అనంతరం చాలా సేపటివరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు సైతం అర్నవ్ కోసం తీవ్రంగా వెతికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అర్నవ్ వైట్ హౌస్ కు సమీపంలో ఉన్న ఎలిప్స్ పార్క్ కు వచ్చాడు. అక్కడ అందరూ చూస్తుండగానే ఒంటికి నిప్పటించుకుంటున్నాడు. గమనించిన స్థానికులువ వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే పూర్తిగా కాలిపోవడంతో డాక్టర్లు కాపాడలేకపోయారు. దీంతో చికిత్స పొందుతూ అర్నవ్ మృతిచెందాడు. అయితే అర్నవ్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.