Begin typing your search above and press return to search.

జాతీయ భద్రతా చట్టానికి తూట్లు పొడిచిన ఆర్నబ్!

By:  Tupaki Desk   |   19 Jan 2021 8:00 PM IST
జాతీయ భద్రతా చట్టానికి తూట్లు పొడిచిన ఆర్నబ్!
X
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి, బార్క్‌ మాజీ సీఈవో పార్థోదాస్‌ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ సంభాషణలు లీకవడం దుమారం రేపింది. దాదాపు 500 పేజీలకుపైగా ఉన్న ఈ చాట్‌ మెసేజ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఇవి తిరుగులేని ఆధారాలు అంటూ పలువురు స్పందిస్తున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సాయం చేస్తానని, మంత్రులంతా తమతోనే ఉన్నారుని ఆర్నబ్ చెప్పిన మాటలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్నబ్ పై మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆర్నబ్, తదితరులు జాతీయ భద్రతకు భంగం కలిగించారని హోంమంత్రి దేశ్ ముఖ్ కు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు సచిన్ సావంత్, రాజు ఫిర్యాదు చేశారు.

వారు అధికారిక రహస్యాల చట్టాన్ని వారు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును కేబినెట్ ముందుంచుతానని, చర్చించి నిర్ణయం తీసుకుంటామని దేశ్ ముఖ్ హామీ ఇచ్చారు. వాట్సాప్ చాట్ సంభాషణల లీకేజీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరపాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. బాలా కోట్ దాడి విషయం ఆర్నబ్ కు ముందే ఎలా తెలిసిందనన్న విషయంపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఓఎస్ఏ సెక్షన్ 5,1923ను ఆర్నబ్ ఉల్లంఘించారని ఆరోపించింది. దూరదర్శన్ ప్రసార్ భారతి శాటిలైట్ సిగ్నల్స్ ను రిపబ్లిక్ టీవీ ఫీజు చెల్లించకుండా వాడుకుంటోందని ఆరోపించింది. టీఆర్పీ కుంభకోణం, అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన, శాటిలైట్ సిగ్నల్స్ వాడకం వ్యవహారాల నేపథ్యంలో ఆర్నబ్ తదితరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.