Begin typing your search above and press return to search.

హత్యను వెనకేసుకొస్తారా? అర్నాబ్ రాజీనామాస్త్రం

By:  Tupaki Desk   |   21 April 2020 5:29 PM IST
హత్యను వెనకేసుకొస్తారా? అర్నాబ్ రాజీనామాస్త్రం
X
ప్రముఖ జర్నలిస్టు - వివాదాస్పద హోస్ట్ అయిన అర్నాబ్ గోస్వామి ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు. రిపబ్లిక్ టీవీ సీఈవోగా చర్చల్లో రాజకీయ నాయకులను చెడుగుడు ఆడే అర్నాబ్ తాజా నిర్ణయం ఢిల్లీ వర్గాల్లో అందరినీ ఆశ్చర్యపరిచింది.

రాజీనామా అనంతరం ఎడిటర్స్ గిల్డ్ ను అర్నాబ్ గోస్వామి విమర్శించడం విశేషం. ఎడిటర్స్ గిల్డ్ హక్కుల విషయంలో పూర్తిగా రాజీ పడిందని అర్నాబ్ ఆరోపించారు. లైవ్ టెలివిజన్ లో.. నకిలీ వార్త కథనాలపై మౌనంగా ఉన్నందుకు గిల్డ్ కు రాజీనామా చేస్తున్నానని అర్నాబ్ పేర్కొన్నారు.

ఎడిటర్స్ గిల్డ్ స్వయం సేవా సంస్థగా మారిందని.. సంస్థ స్వలాభం కోసం నడుస్తోందని అర్నాబ్ తీవ్రఆరోపణలు చేశారు.

అర్నాబ్ అసహనానికి ప్రధాన కారణంగా తాజాగా చోటుచేసుకున్న ఒక హత్యోదంతం. పాల్ఘర్ జిల్లాలో గురువారం ఒకరిని ఉరితీయడం వైరల్ అవుతోంది. ఇద్దరు హిందూసాధువులను, వారి కారు డ్రైవర్‌ను కారు నుండి బయటకు లాగి చంపారు. ఈ ఘోరమైన చర్య వీడియో ఆదివారం బయటకు వచ్చింది. ఇలాంటి సంఘటనలపై స్పందించని ఎడిటర్స్ గిల్డ్ చైర్మన్ శేఖర్ గుప్తా రాజీకి నాయకత్వం వహించారని అర్నాబ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే ఈ గిల్డ్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అన్నింట్లోనూ దూకుడుగా ఫైర్ గా ఉండే అర్నాబ్ ఏకంగా ఎడిటర్స్ గిల్డ్ పైనే ఆరోపణలు సంధించడం చర్చనీయాంశమైంది.