Begin typing your search above and press return to search.

అర్ణవ్ గోస్వామి కొత్త ‘షో’

By:  Tupaki Desk   |   7 April 2017 7:26 AM GMT
అర్ణవ్ గోస్వామి కొత్త ‘షో’
X
అర్ణవ్ గోస్వామి.. ఇండియాలోని మీడియా ఎంథూజియాస్ట్ లందరికీ పరిచయం అక్కర్లేని పేరిది. టీవీ షోలను వన్ మేన్ షోగా మార్చి.. ఎదురుగా కూర్చున్నది ఎంతటివారైనా(మోడీని మినహాయిస్తే) గడగడలాడించే టాలెంట్ ఉన్న జర్నలిస్టు. టైమ్స్ నౌలో తనకంటూ ప్రత్యేకమైన షోతో ప్రతి రోజూ కోట్లాది మంది వీక్షకులను అలరించి అశేషంగా అభిమానులను సంపాదించుకున్న టీవీ ప్రెజెంటర్. అయితే.. టైమ్స్ నౌలో ఉన్నంతవరకు ప్రతిరోజూ టీవీలో కనిపించిన ఆయన ఆ సంస్థకు రిజైన్ చేసిన తరువాత మాత్రం పెద్దగా బయట కనిపించడం లేదు. తాజాగా ఓ ఫొటో షూట్ చేసిన ఆయన మరోసారి హాట్ టాపిగ్గా మారారు.

మేన్స్ వరల్డ్ అనే మేగజీన్ కవర్ పేజీ కోసం చేసిన ఫొటోషూట్ ఫొటోలు తాజాగా రిలీజ్ అయ్యాయి. ఆ పత్రిక ఏప్రిల్ ఎడిషన్ ముఖం చిత్రంపై ఆయన కనిపిస్తున్నారు. పత్రిక ఇంకా మార్కెట్లోకి రాలేదు కానీ సోషల్ మీడియాకు మాత్రం విడుదల చేశారు.

కాగా తన షోలో చాలా దూకుడుగా ఉండే అర్ణవ్ బయట మాత్రం చాలా కూల్ లుక్ తో ఉంటారు. అలాంటి అర్ణవ్ తో ఏకంగా మ్యాగజీన్ కవర్ కోసం ఫోటో షూట్ చేయడంతో ఇకపై అర్ణవ్ ప్రకటనల్లో కనిపిస్తారన్న టాక్ మొదలైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/