Begin typing your search above and press return to search.

అర్ణవ్ గోస్వామి.. ద హైలీ పెయిడ్ జర్నలిస్టు

By:  Tupaki Desk   |   14 Aug 2016 9:02 AM GMT
అర్ణవ్ గోస్వామి.. ద హైలీ పెయిడ్ జర్నలిస్టు
X
అర్ణవ్ గోస్వామి.. ఈ పేరు భారతదేశ మీడియాలో - జాతీయ స్థాయి రాజకీయ నేతల్లో బాగా పాపులర్. మీడియాలో ఆయన ఒక అట్రాక్షన్ - క్రేజ్ - ఇన్స్పిరేషన్.. ఇంకొందరికి అసూయ, మరికొందరికి వెటకారం. రాజకీయ నేతల్లో చాలామందికి ఆయన ప్రోగ్రాంకు వెళ్లి పాపులర్ కావాలన్న తహతహ.. మరికొందరికి కోపం.. ఇంకొందరికి ఆయనడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేని నిస్సహాయత. టైమ్స్ నౌ ఛానల్ చీఫ్ ఎడిటర్ హోదాలో ఉన్న ప్రఖ్యాత న్యూస్ ప్రజెంటర్ అర్ణవ్ గోస్వామికి ఉన్న పాపులారిటీ ఇండియాలో ఇంకే జర్నలిస్టుకు లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆయన అందుకునే వేతనం ఇండియన్ మీడియాలోనే ఎక్కువ. నెలకు కోటి రూపాయలకు పైగా వేతనం తీసుకుంటారాయన.

అస్సాంలోని గౌహతికి చెందిన అర్ణవ్ ది ఉన్నత కుటుంబం. ఆయన తాత రజనీకాంత గోస్వామి ప్రముఖ న్యాయమూర్తి, స్వాతంత్ర్య పోరాటయోధుడు కూడా. గోస్వామి తండ్రి మనోరంజన్ భారత సైన్యంలో కల్నల్ గా పనిచేశారు. అర్ణవ్ విద్యాభ్యాసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాగింది. పదో తరగతి ఢిల్లీలో చదివిన ఆయన ఇంటర్మీడియట్ జబల్ పూర్ లో చదువుకున్నారు. ఆ తరువాత హిందూ కాలేజిలో చదివారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో సోషల్ ఆంత్రపాలజీలో పీజీ చదివారు.

కోల్ కతాలో కెరీర్ మొదలు..

గోస్వామి జర్నలిజం కెరీర్ కోల్ కతాలో మొదలైంది. టెలిగ్రాఫ్ పత్రికలో ఆయన తన కెరీర్ ను 1995లో ప్రారంభించారు. అయితే, అక్కడ ఏడాది కూడా పనిచేయలేదు. ఆ తరువాత ఎన్డీటీవీలోకి వచ్చేశారు. 2003 వరకు అక్కడ పనిచేశారు. ఎన్డీటీవీలో ఉండగానే 2004లో దేశంలో బెస్ట్ న్యూస్ యాంకర్ గా అవార్డు అందుకున్నారు.

2006లో టైమ్సు నౌ ఛానల్ కు చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు తీసుకున్నాక ఆయన కెరీర్ మరింత ఊపందుకుంది. ప్రపంచ స్థాయి నేతలను కూడా ఆయన ఇంటర్వ్యూ చేసి ధైర్యంగా ఏ ప్రశ్ననైనా అడిగేవారు. పర్వేజ్ ముషారఫ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటివారిని ఆయన ఇంటర్వ్యూలు చేశారు. 2008 తరువాత న్యూస్ అవర్ పేరుతో రాత్రి 9 గంటలకు ఆయన నిర్వహించే ముఖాముఖి కార్యక్రమానికి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే.. ఇంటర్వ్యూల్లో ఆయన చూపించే దూకుడుపై విమర్శలు కూడా ఉన్నాయి.