Begin typing your search above and press return to search.

అర్న‌బ్ గోస్వామీ కొత్త చాన‌ల్ పేరిదే!

By:  Tupaki Desk   |   16 Dec 2016 12:27 PM GMT
అర్న‌బ్ గోస్వామీ కొత్త చాన‌ల్ పేరిదే!
X
నేష‌న్ వాంట్స్ టు నో... ఈ మాట వినప‌డితే చాలు వెంట‌నే గుర్తుకువ‌చ్చే పేరు అర్న‌బ్ గోస్వామి. టైమ్స్ నౌ ప్రైమ్ టైమ్‌ లో అర్న‌బ్ చ‌ర్చ‌గోష్టి రాజ‌కీయ నాయ‌కుల‌కు చెమ‌ట‌లు పుట్టిస్తుంద‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అంత‌టి ప్ర‌త్యేక‌త ఇచ్చిన టైమ్స్ నౌ ఛాన‌ల్‌ కు ఇటీవ‌లే అర్న‌బ్ గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత ఆయ‌న ఏం చేయ‌నున్నారు అనే సందేహాల‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం వ‌స్తోంది. కొత్త‌గా ఓ ఇంగ్లిష్ ఛాన‌ల్‌ తో అర్న‌బ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నార‌ని స‌మాచారం. ‘రిపబ్లిక్’ పేరుతో చానల్ ను రిజిస్టర్ చేయించడ‌మే కాకుండా ఈ చాన‌ల్ లాంచ్ చేసేందుకు అర్న‌బ్ స‌ర్వం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న యూపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఛాన‌ల్ ను ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి తేనున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఢిల్లీకి ద‌గ్గ‌రి దారిగా భావించే యూపీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌న ఛాన‌ల్‌ ను లాంచ్ చేసేందుకు అర్న‌బ్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. త‌ద్వారా దేశం దృష్టిని ఆక‌ర్షించే అవ‌కాశం దొరుకుతుంద‌ని బావిస్తున్నారు. ఇదిలాఉండ‌గా అర్న‌బ్ స్థానంలో టైమ్స్ నౌ చీఫ్ ఎడిటర్‌ బాధ్య‌త‌ల‌ను సీనియ‌ర్ ఎడిట‌ర్ రాహుల్ శివ‌శంక‌ర్ స్వీక‌రించారు.

కాగా కొద్దికాలం క్రితం కొత్త అంచ‌నాలు వెలువ‌డ్డాయి. ప్ర‌ముఖ పెట్టుబ‌డిదారుడు, క‌ర్ణాట‌కు చెందిన‌ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్‌ తో కలిసి అర్న‌బ్ కొత్త ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ మొదలుపెడతారని వినిపించింది. ఇందులో ప్ర‌ముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్‌ లో స్టార్ ప్లస్ ను సైతం వాటాదారుడిగా చేసుకుంటున్నార‌ని, స్టార్ ప్ల‌స్‌ 26 శాతం వాటా తీసుకుంటుందని వార్త‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/