Begin typing your search above and press return to search.

దేనికైనా సిద్ధం అంటున్న ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ !

By:  Tupaki Desk   |   1 Jan 2020 10:10 AM GMT
దేనికైనా సిద్ధం అంటున్న ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ !
X
దేశ నూతన సైన్యాధ్యక్షునిగా జనరల్ మనోజ్ ముకుంద్ నరావణే మంగళవారం ఉదయం బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే. దేశ రాజధానిలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కార్యాలయంలో ఆయన బాధ్యతలను చేపట్టారు. ఇక నేడు (బుధవారం) ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ వద్ద సైనిక వందనం స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా దేశంలో ఉత్తరాదిన, ఈశాన్య ప్రాంతాల్లో సైన్యం సామర్థ్యత ను మరింత పెంచుతామని ఆయన తెలిపారు.

అలాగే అన్ని వేలలా సంసిధ్ధంగా ఉండాలన్నదే సైన్యం ధ్యేయమని, ఇది తమ ప్రాధాన్యత అని అయన తెలిపారు. ముఖ్యంగా మానవ హక్కులను గౌరవించడం పట్ల ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటామని ఆయన అన్నారు. భారత సైన్యంలో 28 వ ప్రధాన అధికారి అయిన మనోజ్ ముకుంద్.. ముందు కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. దీర్ఘ కాలం పెండింగులో ఉన్న సంస్కరణల అమలు, కాశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదం అదుపు, టిబెట్ ప్రాంతంలో చైనా సైనిక జాడలపై నిఘా వంటివి ఇందులో ముఖ్యమైనవి. 37 ఏళ్ళ తన సర్వీసులో ఆయన, అనేక కమాండ్, స్టాఫ్ అపాయింట్ మెంట్లకు సంబంధించిన అధికారి హోదాల్లో పని చేశారు. జమ్మూ కాశ్మీర్లో కౌంటర్ ఇన్ సర్జెన్సీ కార్యకలాపాలకు నేతృత్వం వహించారు.

ఇక పొతే కొత్తగా ఆర్మీ చీఫ్ జనరల్ గా భాద్యతలు స్వీకరించిన మనోజ్ ముకుంద్ కి దేశ సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో సిద్ధహస్తుడిగా పేరు ఉంది. ఇదివరకు చైనా, మయన్మార్ దేశాలతో తలెత్తిన సరిహద్దు వివాదాల్లో ఆయన చురుకుగా వ్యవహరించారు. చైనాతో సిక్కిం సరిహద్దు ల్లోని డోక్లాం కూడలి వివాద సమయంలో చాకచక్యంగా వ్యవహరించారు. ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ లోని లడక్ వద్ద చైనా తో తలెత్తిన అక్సాయ్ చిన్ వివాదానికి అడ్డుకట్ట వేయడం లో మనోజ్ ముకుంద్ తనదైన శైలిలో పావులు కదిపారు.