Begin typing your search above and press return to search.

గాల్వాన్ పై పట్టు సాధించిన భారత్..

By:  Tupaki Desk   |   21 Jun 2020 8:30 AM GMT
గాల్వాన్ పై పట్టు సాధించిన భారత్..
X
భారత్-చైనా సరిహద్దుల్లో గత నెలరోజులుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల లఢక్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో భారత జవాన్లు 20మంది అమరులు కాగా.. చైనాకు చెందిన 40మంది మరణించినట్లు తెలుస్తోంది. ఓ వైపు శాంతి చర్చలతో పేరుతో చైనా భారత్ ను దొంగ దెబ్బతీయడంపై కేంద్రం కూడా సీరియస్ అయింది.

ఈ నేపథ్యంలో భారత్-చైనా మధ్య యుద్ధ మేఘాలు ఆవరించారు. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని మోదీ స్పందిస్తూ జవాన్ల మృతి వృథాగా పోదనే సంకేతాలిచ్చారు. మరో వైపు చైనా స్పందిస్తూ భారత్ సైనికులే తమ భూభాగంలోకి రావడం వల్లే ఘర్షణ జరిగిందని ఆరోపిస్తుంది. అంతేకాకుండా గాల్వాన్ లోయ తమదేనంటూ చైనా అధికారికంగా ప్రకటించింది. చైనా ప్రకటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. చైనా ప్రకటించిన నిర్ణయం తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది.

ఇదిలా ఉంటే భారత భూభాగంగా పరిగణిస్తోన్న పాంగాంగ్ సరస్సు వెంట ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో చైనా కొన్ని నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. మే ప్రారంభం నుంచి చైనా సైన్యం డజన్ల కొద్దీ కొత్త స్థావరాలు, బంకర్లను నిర్మించిందనే సందేహాలు వ్యక్తమవుతోన్నాయి. భారత్ తో శాంతి చర్చల సమయాన్ని చైనా చక్కగా ఉపయోగించుకుందనే వాదనలున్నాయి. భారత్-చైనా ఘర్షణ అనంతరం గాల్వన్ లోయ పెట్రోలింగ్ పాయింట్-14 సమీపంలోని ప్రాంతం పై ఇండియన్ ఆర్మీ ప్రస్తుతం పట్టు సాధించిందని అధికారికం గా వెల్లడించాయి.

ఈ ప్రాంతం లోనే ఇటీవల చైనా-భారత సైనికుల మధ్య వాగ్వాదం మొదలై ఘర్షణ కు దారి తీసింది. ఈ సంఘటన లో భారత్ జవాన్లు 20మంది అమరులుకాగా 76మంది గాయపడ్డారని ఆర్మీ వెల్లడించింది. అయితే ఈ ఘర్షణలో చైనా సైనికులు ఎంతమంది చనిపోయారనేది మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. అయితే చైనాకు కూడా భారీగా నష్టం జరిగిందని తెలుస్తోంది. అయితే గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల సైనిక నిర్మాణాలు ఉండటంతో అంత త్వరగా ఉద్రిక్తతలుతగ్గే పరిస్థితులు కన్పించడం లేదు. దీంతో సరిహద్దుల్లో ఎప్పుడు జరుగుతుందోననే భయాందోళనలు నెలకొన్నాయి.