Begin typing your search above and press return to search.

ఆర్మీ చీఫ్ రావ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   27 Jun 2018 9:15 AM GMT
ఆర్మీ చీఫ్ రావ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X
ప‌దేళ్ల మ‌న్మోహ‌న్ పాల‌న‌లో కానీ..అంత‌కు ముందున్న ప్ర‌ధానుల హ‌యాంలోనూ ఎప్పుడూ ఆర్మీ చీఫ్ లు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌టం చూసి ఉండం. మోడీ స‌ర్కారులో మాత్రం అందుకు భిన్నంగా ఆర్మీ చీఫ్ చేస్తున్న వ్యాఖ్య‌లు మీడియాలో వ‌స్తున్నాయి. గ‌తంలో ఎప్పుడూ లేనంత ఉత్సాహాన్ని తాజా ఆర్మీ చీఫ్ ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లుగా చెప్పాలి. విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాల్ని పూర్తిగా రాజ‌కీయ నేత‌లే స్పందించే వారు. అందుకు భిన్నంగా మోడీ హ‌యాంలో త్రివిధ ద‌ళాధిప‌తులు అప్పుడ‌ప్పుడు గ‌ళం విప్ప‌టం కొత్త‌గా మొద‌లైన అల‌వాటుగా చెప్పాలి.

తాజాగా ఆర్మీ చీఫ్ రావ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌శ్మీర్ పై ఐక్య‌రాజ్య‌స‌మితి వెలువ‌రించిన నివేదిక‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఈ నివేదిక‌లోని కొన్ని అంశాలు ప్రేరేపించి చెప్పిన‌ట్లుగా ఉన్న‌ట్లు వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. భార‌త్ - పాక్ స‌రిహ‌ద్దుల‌కు ఇరువైపులా క‌శ్మీర్ లో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతోంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ జ‌ర‌పాలంటూ నివేదిక పేర్కొన్న విష‌యం తెలిసిందే.

దీనిపై రియాక్ట్ అయిన రావ‌త్‌.. నివేదిక‌పై తాము మాట్లాడాల్సిన అవ‌స‌రం లేదన్నారు. మాన‌వ హ‌క్కుల విష‌యంలో భార‌త సైన్యం రికార్డు మిగిలిన వారంద‌రి కంటే పైనే ఉన్న‌ట్లు చెప్పారు. ఆ విష‌యం భార‌త ప్ర‌జ‌లు.. సైనికుల‌తో పాటు ప్ర‌పంచ దేశాల‌న్నింటికి తెలుస‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఐక్యారాజ్య‌స‌మితి నివేదిక‌ను పట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా ఐక్య‌రాజ్య‌స‌మితి రూపొందించిన నివేదిక వాస్త‌వాలు తెలుసుకోకుండా త‌యారు చేసింద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.