Begin typing your search above and press return to search.

పోర్న్ ఎక్కువగాచూస్తున్నారా ...అయితే , వచ్చే కొత్త సమస్యలు ఏవంటే ?

By:  Tupaki Desk   |   22 July 2021 6:44 AM GMT
పోర్న్ ఎక్కువగాచూస్తున్నారా ...అయితే , వచ్చే కొత్త సమస్యలు ఏవంటే ?
X
పోర్న్ చూడడం ఇక్కడ నిషిద్ధం. అయినా, ఎంతో మంది పోర్న్ చూడడాన్ని తమ రొటీన్ లో భాగంగా చేసుకున్నారు. ఈ విషయం షాకింగ్ గానే ఉంటుంది. వీరందరూ పోర్న్ చూసేందుకు తమ డైలీ లైఫ్ లో కాస్తంత ఎక్కువ సమయాన్నే స్పెండ్ చేస్తారు. ఇంకొక షాకింగ్ విషయమేంటంటే వీరిలో కొంతమంది పోర్నోగ్రఫిక్ కంటెంట్ కోసం ఎంతదూరమైనా వెళ్ళిపోతారు.

ముఖ్యంగా లాక్‌ డౌన్‌, క‌రోనా కార‌ణంగా యువ‌త ఎక్కువ‌గా పోర్న్ చూడ‌టానికి సమయం దొరకడం తో దానిపై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నార‌నేది చాలా స‌ర్వేల్లో వెల్ల‌డైంది. ఇటీవ‌లి కాలంలో ఇంట‌ర్నెట్ ఎక్కువ‌గా అందుబాటులోకి రావ‌డం మ‌రో కార‌ణంగా క‌నిపిస్తుంది.

పోర్న్ ఎక్కువగా చూసేవారిలో అంగస్థంభన సమస్య తీవ్రంగా ఉంటుందని , అశ్లీల వీడియోల చూడటమనేది.. అంగస్తంభన పనితీరుతో ముడిపడి ఉందని పరిశోధకులు అంటున్నారు. పోర్న్ చూడడానికి బానిసయ్యాక రెగ్యులర్ పోర్న్ అంత కిక్కునివ్వదని మీరు భావిస్తారు. వెంటనే రెగ్యులర్ వాటిని కాకుండా మరింత వైవిధ్యంగా ఉండేటటువంటి వింతైన ఫాంటసీస్ కోసం సెర్చులు చేస్తారు. ఇలా ఈ అడిక్షన్ అనేది మీ మానసిక స్థితిపై దుష్ప్రభావం చూపుతుంది.

పోర్న్ కంటెంట్ను చూడడం క్రమేపీ వ్యసనంగా మారి కొత్త సమస్యలు సృష్టిస్తోంది. పలు అధ్యయనాల ప్రకారం, పోర్న్ చూసే పురుషులు తమ లైంగిక జీవితంలో ఎక్కువ అసంతృప్తితో ఉంటారని, అదే ఒకపట్టాన సంతృప్తి చెందనీయకుండా చేస్తున్నట్లు తేలింది. పోర్న్ కంటెంట్‌ చూడడం అనే అలవాటు చాలా వరకు ఆల్కహాల్ వినియోగంతో పోల్చిచూడొచ్చు.

ఇది అందరికీ చెడ్డది కాదు, కానీ కొన్ని ప్రమాద కారకాలకు దారితీస్తోంది. అశ్లీలతపై పూర్తిగా ఆధారపడే వ్యక్తులను అత్యాచారం లేదా లైంగిక హింస వంటి నేరాలకు ప్రేరేపిస్తుంది. లైంగిక హింస, దూకుడు స్వభావాన్ని పెంపొందిస్తుంది. ఒక నివేదిక ప్రకారం, అశ్లీల చిత్రాలకు బానిసలైన వ్యక్తులెవరంటే తమ జీవితంలో ఆర్థిక, ఉపాధి సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నవారేనని తేలింది. పోర్న్ కంటెంట్ మనిషి శరీరంలో డోపామైన్ విడుదలను ప్రాక్టికల్ కాని రీతిలో ప్రేరేపిస్తుంది, ఇది ఒక వ్యక్తిని నిరాశావాదిగా చేస్తున్నట్లు గుర్తించారు.

శృంగార కంటెంట్, అశ్లీల ఆలోచనలు మరియు లైంగిక జీవితంలో అవాస్తవ అంచనాలను ప్రోత్సహిస్తుంది. ఇది మహిళల పట్ల పురుషుల వైఖరిని మరింత ప్రతికూలంగా మరియు మూసపోతగా చేస్తుంది. పోర్న్ ను ఎక్కువగా చూడడం వలన అనేక సమస్యలు తలెత్తుతాయన్న విషయం మీకు తెలుసు. హెల్త్ ప్రాబ్లెమ్స్ తో పాటు ఫైనాన్షియల్ అలాగే మెంటల్ హెల్త్ ప్రాబ్లెమ్స్ వస్తాయి. ఈ విషయం తెలిసి కూడా మీరు పోర్న్ ను చూడడం ఆపలేకపోతున్నారంటే మీరు అడిక్ట్ ఐపోయారని గుర్తించాలి.

మరో ప్రత్యేక విషయం ఏమిటంటే, ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడానికి నిపుణులు పోర్న్ చూడటానికి గడిపే సమయాన్ని తగ్గించమని ప్రజలకు సలహా ఇస్తున్నారు. సెక్స్ లేదా సాన్నిహిత్యం గురించి మీ అవగాహన పెంచుకోవడానికి పోర్న్ కంటెంట్ సరైన మార్గం కాదని గుర్తుంచుకోమంటున్నారు. అశ్లీలత కారణంగా చాలా మంది ఇప్పటికే చాలా అశాంతిగా ఉంటున్నారు. అశ్లీల వ్యసనాలతో పోరాడుతున్న వ్యక్తులు కావాలనుకుంటే సోషల్ మీడియాలో స్నేహితులతో తిరిగి కనెక్ట్ కావచ్చు.

పోర్న్ చూడడం వలన సెక్స్ పై ఆసక్తి కోల్పోతారు. పార్ట్నర్ తో ఎంజాయ్ చేయవలసిన టైంను కూడా మీరు పోర్న్ ను చూడడంతోనే గడిపేస్తున్నారు. కాబట్టి, పార్టనర్ తో సమస్యలు వస్తాయి. మీ పట్ల అసంతృప్తిని మీ పార్ట్నర్ చెప్పడంతో ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బతింటుంది. పోర్న్ చూసి చూసి మీరు ఆ యాక్టివిటీను చూసేందుకే ఇష్టపడతారు. కానీ, పెర్సనల్ గా పార్ట్నర్ తో ఆనందాన్ని పొందలేరు.