Begin typing your search above and press return to search.
మీది డీజిల్ వాహనమా.. మిస్ కాకుండా చదవాల్సిందే
By: Tupaki Desk | 14 Feb 2020 3:00 AM ISTమీరు ఉపయోగించే వాహనం డీజిలా? మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా? అయితే.. ఇది మొత్తం చదవాల్సిందే. ఎందుకంటే.. డీజిల్ వెహికిల్స్ మీద నజర్ వేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. వాతావరణాన్ని కలుషితం చేయటం లో డీజిల్ వాహనం ముందుంటాయి. ఈ నేపథ్యం లో ఈ వాహనాల మీద ఆంక్షలు విధించేందుకు వీలుగా ఉన్న అంశాల్ని సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. డీజిల్ వాహనాల్ని నియంత్రించటం తో పాటు.. వాటి పై పన్నుల వడ్డింపు విషయం మీదా ఫోకస్ చేయాలని రవాణా శాఖ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
కలెక్టర్ల సదస్సు లో వాహనాల గురించి ప్రస్తావించిన ముఖ్యమంత్రి.. దేశ రాజధాని ఢిల్లీ ఎదుర్కొంటున్న వాయు కాలుష్య సమస్య హైదరాబాద్ ను తాకేంతవరకూ చూడొద్దని.. చర్యలు తీసుకోవాలని చెప్పారు. వాహనాల పొగతో నగరం వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి చేయటానికి ముందే.. మొక్కలు పెంచటంతో పాటు డీజిల్ వాహనాల్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యల్ని తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ మహా నగరం లో పదిహేను లక్షల డీజిల్ వాహనాలు తిరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో వాహనాల సంఖ్య పెరగకుండా చూడటంతో పాటు.. డీజిల్ వాహనాల్ని కొనుగోలు చేసే విషయంలో ఆసక్తి తగ్గించే ప్రయత్నాలను ప్రభుత్వ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పెట్రోల్ తో పోలిస్తే.. డీజిల్ వాహనం మీద రెండు శాతం అదనంగా లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని మరింత పెంచాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.
అదే సమయం లో 12 ఏళ్లు తిరిగిన డీజిల్ వాహనాల్ని నిషేధించాలన్న ఆలోచనలోనూ ఉన్నారు. డీజిల్ వాహనాల కొనుగోలు మీద ఆసక్తి తగ్గేలా చేయటంతో పాటు.. ఎలక్ట్రికల్ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు వీలుగా విధానాన్ని రూపొందించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా బ్యాటరీ వాహనాలకు పన్నులు.. ఇతరత్రా ప్రోత్సహకాలు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. డీజిల్ వాహన దారులకు రానున్న రోజుల్లో తిప్పలు తప్పవనే చెప్పాలి.