Begin typing your search above and press return to search.

బరువు తగ్గాలని నెయ్యిని దూరం పెడుతున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

By:  Tupaki Desk   |   8 May 2021 7:30 AM GMT
బరువు తగ్గాలని నెయ్యిని దూరం పెడుతున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
X
ఇటీవల కాలంలో అధిక బరువు అనే సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పెద్దవారి నుంచి యువతలోనూ ఈ సమస్య తలెత్తుతోంది. ఫలితంగా కఠిన ఆహార నియమాలను పాటిస్తున్నారు. అందులో భాగంగా నెయ్యిని దూరం పెడుతున్నారు. నెయ్యి తింటే బరువు పెరుగుతారని, శరీరంలో అధిక కొవ్వు ఏర్పడుతుందని నెయ్యి తినడం మానేస్తున్నారు. ఈ నెయ్యి అనేది భారతీయుల ఆహారంలో సర్వసాధారణమైన ఆహారం. పురాతన కాలం నుంచి మన ఆహారంలో భాగంగా ఉంది. కానీ బరువు తగ్గడం పేరిట దీనికి దూరంగా ఉంటున్నారు.

నెయ్యి తినడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు. అధిక బరువు పెరగడానికి ఇది కారణం అని భావిస్తున్నారు. అందుకే కనీసం నెయ్యితో చేసిన పదార్థాలను సైతం ముట్టడం లేదు. నిజానికి అవాస్తవం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతారనేది అబద్ధమేనని తేల్చారు. నెయ్యిని భేషుగ్గా ఆహారంలో భాగం చేసుకోవచ్చని సూచించారు. అంతేకాకుండా సమతుల్య ఆహారానికి తగిన పోషకాలు ఇందులో ఉంటాయని చెబుతున్నారు.

స్వచ్ఛమైన దేశీ నెయ్యిలో శరీరానికి ఉపయోగపడే ముఖ్య పోషకాలు అధకంగా ఉన్నాయని అంటున్నారు. ఆవు పాలతో చేసిన నెయ్యిలో కొవ్వు పదార్థాలు ఉండవని తెలిపారు. అది చెడు కొవ్వు పేరుకునేలాగా ఉండదని స్పష్టం చేశారు. నెయ్యి తినడం వల్లే వచ్చే పోషకాలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయని చెబుతున్నారు. నెయ్యితో చేసిన పదార్థాలు తినడం మంచిదని ఆధునిక వైద్య శాస్త్రం, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనితో చక్కటి ఫలితం పొందుతారని తెలిపారు.

నెయ్యిలో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయని చెబుతున్నారు. ఇది కొవ్వును కరిగిస్తుందని అంటున్నారు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు చక్కటి శరీర ఆకృతిని తీసుకువస్తాయని అంటున్నారు. కాబట్టి శరీరంలోని చెడు కొవ్వుని తగ్గించడానికి ఒమేగా-3 చాలా ఉపయుక్తంగా ఉంటాయని అంటున్నారు. నెయ్యి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి బరువు పెరగరు అని నిపుణులు స్పష్టం చేశారు.