Begin typing your search above and press return to search.

నువ్వసలు అమ్మాయివేనా..! ‘మిస్‌ ట్రాన్స్‌ ఇండియా’ అడుగడుగునా అవమానాలే..!

By:  Tupaki Desk   |   6 Jan 2021 6:00 AM IST
నువ్వసలు అమ్మాయివేనా..!  ‘మిస్‌ ట్రాన్స్‌ ఇండియా’ అడుగడుగునా అవమానాలే..!
X
ఆర్చీ సింగ్​ ఇటీవల మిస్​ట్రాన్స్​ ఇండియాగా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఆమె జీవితం మొత్తం వడ్డించిన విస్తరి కాదు. ఆర్చీ సింగ్​ జన్మతహా స్త్రీకాదు.. ఆమెకు స్త్రీ లక్షణాలతో పుట్టింది అంతే. దీంతో ఆమెకు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువారి నుంచి కూడా ఆమెకు ప్రోత్సాహం దక్కలేదు. తన అనుకున్న వాళ్లు కూడా అవమానించాక ఇక బయట వారి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఆర్చీసింగ్​ 17 వ ఏట పూర్తిస్థాయిలో మహిళగా మారిపోయింది. ఆమె మోడలింగ్​ను కెరీర్​గా ఎంచుకున్నది. అక్కడకూడా అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. నువ్వు పూర్తిస్థాయి స్త్రీవి కాదు కదా..! అంటూ ఆమెను అవమానించేవారు.

‘నువ్వు అమ్మాయివి కాదు కదా..!’ ఆమె జీవితంలో అనేకసార్లు ఎదురైన ప్రశ్న ఇదే. అయితే ఆమె ఇప్పుడు మిస్‌ ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌ 2021లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది. కొలంబియాలో జరిగే అందాల పోటీలకు సన్నద్ధమవుతోంది. అయితే కుటుంబం ఆమెను తొలుత కొంత అవమానించినప్పటికీ ఆ తర్వాత అక్కున చేర్చుకున్నది. దీంతో ఆర్చి ప్రస్తుతం రాణించగలిగింది.

అయితే మనసమాజంలో ఇంకా ట్రాన్స్​జెండర్స్​ గౌరవించుకొనే పరిణతి రాలేదని ఆమె చెప్పుకొచ్చింది. ట్రాన్స్​జెండర్​లు అంటే ప్రజల్లో ఓ రకమైన చిన్నచూపు ఉందని ఆమె పేర్కొన్నది. ఈ సంకుచిత భావాలు పోవాలంటే ప్రజలు మరింత ఉన్నతంగా ఆలోచించాలని ఆమె పేర్కొన్నది. ఇతర దేశాలతో పోల్చినప్పుడు ట్రాన్స్​జెండర్లపై మనదేశంలో వివక్ష ఉందని ఆమె పేర్కొన్నది.

మిస్‌ ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌ 2021 టైటిల్‌ విజేతగా నిలవడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నది.