Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేలు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారా ?

By:  Tupaki Desk   |   8 Dec 2021 8:00 AM IST
వైసీపీ ఎమ్మెల్యేలు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారా ?
X
ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ 151 సీట్ల‌తో గెలిచి బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. అయితే వీరిలో చాలా మందికి రాజ‌కీయాల‌తో సంబంధం లేదు. జ‌గ‌న్ అప్ప‌టిక‌ప్పుడు కొంత‌మందికి సీట్లు ఇవ్వ‌డంతో వారంతా ఎమ్మెల్యేలు అయిపోయారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మందికి రాజ‌కీయంగా ఓన‌మాలు కూడా తెలియ‌వు. వారు ఇప్పుడు పార్లమెంటులో చేస్తోంది కూడా ఏమీ లేదు. ఇక ఎమ్మెల్యేలుగా జ‌గ‌న్ వేవ్‌లో గెలిచిన వారిలో చాలా మంది గెలిచిన రెండు మూడు నెల‌ల‌కే రిలాక్స్ అయిపోయారు. అయితే క్ర‌మ‌క్ర‌మంగా ఆరు నెల‌ల నుంచే వీళ్ల మ‌బ్బులు వీడ‌డం స్టార్ట్ అయ్యాయి.

క‌నీసం 100 మందికి పైగా ఎమ్మెల్యేల‌కు రెండేళ్ల‌కు గాని జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ దొర‌క‌లేదు. దీంతో త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నుల కోసం ఎవ‌రిని క‌ల‌వాలో కూడా తెలియ‌క దిక్కుతోచ‌క కొట్టుమిట్టాడారు. ఆ త‌ర్వాత క‌రోనా రావ‌డంతో ప‌రిస్థితి మ‌రింత ఘోర‌మైంది. పార్టీ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డంతో వీరికి ల‌క్‌గా టిక్కెట్ వ‌చ్చింది. ఇక ఇప్పుడు అధికారంలో ఉండ‌డంతో చాలా మంది డ‌బ్బున్న వాళ్లు సంచులు ప‌ట్టుక‌ని మ‌రీ టిక్కెట్ల కోసం క్యూలో ఉంటున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎంత‌మందికి టిక్కెట్ వ‌స్తుందో రాదో ? తెలియ‌ని ప‌రిస్థితి ఉంది.

క‌నీసం చిన్న రోడ్డు కూడా వేయించ‌లేని దుస్థితి చాలా మంది ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు. దీంతో వీళ్లు ఈ రెండేళ్ల‌లో ఇలాంటి చిన్న ప‌నులు కూడా చేయ‌కుండా ప్ర‌జ‌ల్లోకి ఎలా ? వెళ్లాలిరా బాబు అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇక జ‌గ‌న్ ఇప్ప‌టికే స‌ర్వేలు చేయ‌డం స్టార్ట్ చేశారు. ప‌నులు చేయ‌క‌, ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌ని ఎమ్మెల్యేల‌కు రేపు వ్య‌తిరేకంగానే నివేదిక‌లు వ‌స్తాయ్‌. అప్పుడు వీటిని బూచిగా చూపించే జ‌గ‌న్ వీళ్ల‌ను ప‌క్క‌న పెట్టేస్తార‌న్న భ‌యాలు కూడా చాలా మందిని వెంటాడుతున్నాయ్‌..!

అటు జ‌గ‌న్ కూడా చాలా మంది ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌న్న విష‌యం గ్ర‌హించారు. ఇప్ప‌టికే కొంద‌రు ఎమ్మెల్యేల‌కు ప‌నితీరు మార్చుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వారి విశ్వాసం చూర‌గొన‌క‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ఉండ‌వ‌ని చెపుతున్నారు. అయితే అటు నిధులు లేక ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేని ప‌రిస్థితి ఎమ్మెల్యేల‌ది. ఏదేమైనా జ‌గ‌న్‌ను ఆ పార్టీలో ఎవ‌రైనా త‌క్కువ అంచ‌నా వేస్తే.. ఎలాంటి వారి తోక‌లు అయినా ఇట్టే క‌ట్ చేసేస్తార‌న‌డంలో డౌటే లేదు. ఇక ఎమ్మెల్యేల‌కు కూడా అప్పుడే టిక్కెట్ భ‌యం అయితే ప‌ట్టుకుంది.