Begin typing your search above and press return to search.
అంత బాగా చదువుకున్నోళ్లు కాటికాపరులా పని చేస్తున్నారా?
By: Tupaki Desk | 28 July 2020 11:45 AM ISTవిన్నంతనే ఉలిక్కిపడటమే.. అక్కడకు వెళ్లాలంటే ఎంత ధైర్యవంతుడికైనా కాస్తంత భయం కలుగుతుంది. ఎందుకొచ్చిందిలే అనుకునే పరిస్థితి. ఇప్పుడు చెప్పేదంతా శ్మశానాల గురించే. ఎవరైనా సరే.. శ్మశానానికి వెళ్లే అవసరం ఉండాలని అస్సలు కోరుకోరు. అలాంటిది అక్కడ పని చేయాలనుకుంటారా? అందునా..కరోనా టైంలో అంటే.. నో అంటే నో చెప్పేస్తారు. కానీ.. ఆకలి మహా దుర్మార్గమైనది. అది అస్సలు మాట వినదు. మనిషి చేత ఏదేదో చేయించే సత్తా దాని సొంతం.
తాజాగా కరోనా వేళలో.. పరిస్థితులు ఎంతలా మారిపోయాయో తెలిసిందే. నెలల తరబడి ఇళ్లల్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. వ్యాపారాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న పరిస్థితి. దీనికి తగ్గట్లే.. ఉద్యోగాలు చేసే వారి టైం అస్సలు బాగోలేదు. ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందో అర్థం కాని దుస్థితి. ఇలాంటి వేళలో.. చదువుకున్న చదువును.. గతంలో చేసిన ఉద్యోగాన్ని పక్కన పెట్టి.. ఆకలి మంటలు తీర్చుకునేందుకు ఏ పని చేసేందుకైనా రెఢీ కావటం.. ఎంతటి రిస్కు చేసేందుకైనా ఓకే చెప్పటం ఈ మధ్యన ఎక్కువైంది.
దీనికి నిదర్శనంగా ఈఎస్ఐ శ్మశానవాటికలో శవాల్ని పేర్చటం.. దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయటం లాంటి కూలీ పనులు చేసేందుకు బీకాం ట్యాక్సేషన్ పూర్తి చేసినోడు.. బీఎస్సీ పూర్తి చేసినోళ్లు మరొకరు.. మరో షాపింగ్ మాల్ లో మొన్నటి దాకా సూపర్ వైజర్ పని చేసినోళ్లు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఉపాధి కోసం ఎంతటి అపాయకరమైన పని చేసేందుకు సిద్ధమవుతున్నారు.
హైదరాబాద్ లో కోవిడ్ రోగుల్లో పలువురు మరణిస్తున్న వేళ.. శ్మశానాల వద్ద పనులు కాస్త దొరుకుతోంది. దీంతో.. చేస్తున్న పని ఏమిటన్నది పట్టించుకోకుండా పని చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో వ్యాపార సంస్థలు.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. ఇలా పలు వ్యాపార వాణిజ్యకేంద్రాలు మూతపడ్డాయి. దీంతో.. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయినోళ్లు ఉన్నారు. వీరంతా బతుకుదెరువు కోసం ఏ ఉద్యోగమైనా చేయటానికి సిద్ధమైపోతున్న పరిస్థితి.
ఈఎస్ఐ శ్మశాన వాటికలో పని చేసే వారిలో ఎక్కువ మంది ప్రైవేటు సంస్థలు.. హోటళ్లు.. రెస్టారెంట్ల లో పని చేసేటోళ్లే. వీరికి ఉద్యోగాలు పోవటం తో.. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పని చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందని చెప్పటానికి ఇదొక్క ఉదాహరణ చాలని చెబుతున్నారు. శ్మశానాల్లో పని చేసే వారికి ఒక్కో దహనానికి రూ.500 నుంచి వెయ్యి వరకు ఇస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు భోజనం కూడా పెడుతుండటం తో.. పలువురు ఇక్కడ పని చేసేందుకు వస్తున్నారు. కాకుంటే.. ఇక్కడ పని చేసే వారు కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా ఉండటం ఆందోళన కు గురి చేస్తోంది.