Begin typing your search above and press return to search.

కరోనా యాంటీబాడీలు వాళ్లు వేగంగా కోల్పోతున్నారు? ఎందుకు

By:  Tupaki Desk   |   28 Oct 2020 10:45 AM IST
కరోనా యాంటీబాడీలు వాళ్లు వేగంగా కోల్పోతున్నారు? ఎందుకు
X
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం గజగజ వణికాయి. అయితే కరోనా అరికట్టేందుకు డబ్ల్యూహెచ్​వో చెప్పిన సూచనల ప్రకారం నడుచుకుంటూ పలు దేశాలు కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నాయి. అయితే కరోనా ప్రభావంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. ఇమ్యూనిటీ ఉన్నవాళ్లు ఈ మహమ్మారి నుంచి తప్పించుకోగలిగారు. కొంతమందిలో కరోనా లక్షణాలు బయటపడితే.. చాలా మందికి కరోనా ఎలా వచ్చిందో ఎలా పోయిందో కూడా తెలియలేదు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై పలు ఆసక్తికర అధ్యయనాలు బయటపడుతున్నాయి.

కరోనా లక్షణాలు ఉన్నవారితో పోలిస్తే.. లక్షణాలు లేని వైరస్​ బాధితులు వేగంగా యాంటీబాడీలు వేగంగా కోల్పోతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. బ్రిటన్​లోని ఇంపీరియల్​ కాలేజ్​ పరిశోధకులు చేసిన పరిశోధనలు ఈ విషయం తేటతెల్లమైంది. లక్షా 65 వేల మందిపై చేసిన ఈ పరిశోధన లక్షణాలు లేనివారిలో యాంటీబాడీల తగ్గుదల రేటు వేగంగా ఉందని వెల్లడైంది. అంతేకాక, యువకులతో పోలిస్తే 75 ఏళ్లు దాటినవారిలో మరింత వేగంగా యాంటీబాడీలు క్షిణించాయని ఈ పరిశోధన పేర్కొన్నది. ఏది ఏమైనా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇమ్యూనిటీని పెంచుకొనేందుకు ప్రజలు బలమైన ఆహారపదార్థాలు తీసుకోవాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోని కరోనాను జయించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.