Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ రాష్ట్రాలే కీలకమా ?

By:  Tupaki Desk   |   23 Oct 2020 10:30 AM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ  రాష్ట్రాలే కీలకమా ?
X
మరో 15 రోజుల్లో జరగనున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆరు రాష్ట్రాల్లో జరిగే ఓటింగే కీలకమయ్యేట్లుంది. అంటే అధ్యక్ష ఎన్నికల్లో ఆరురాష్ట్రాలే డిసైడ్ చేసేస్తాయని కాదుకానీ ఎక్కువ భాగం ఈ రాష్ట్రాల్లో జరిగే ఓటింగ్ ప్రభావం ఉంటుందని చరిత్ర చెబుతోంది. ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్ సిన్, నార్త్ కరోలినా, ఆరిజోనా రాష్ట్రాల పాత్ర మాత్రం ఎక్కువుగా ఉంటుందనే సర్వేలు గట్టిగా చెబుతున్నాయి. ఎందుకంటే వైట్ హౌస్ లో అడుగుపెట్టడానికి అవసరమైన 270 ఎలక్టరోల్ ఓట్లలో 101 ఓట్లు పై ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అందుకనే అందరి దృష్టి పై ఆరు రాష్ట్రాలపైనే కేంద్రీకృతమైంది.

ఫాక్స్ న్యూస్ మీడియా రిలీజ్ చేసిన తాజా సర్వేలో మిషిగాన్ లో జో బెడైన్ కు క్లియర్ మెజారిటి కనబడింది. ఇదే సమయంలో విస్కాన్ సిన్ స్టేట్లో కూడా బైడెన్ కు మెజారిటి ఉన్నా కానీ తక్కువనే తేలింది. ఇప్పటివరకు జరిగిన చాలా సర్వేల్లో పై ఆరు రాష్ట్రాల్లో బైడెన్ కు ట్రంప్ మీద స్పష్టమైన ఆధిక్యత ఉన్నట్లు బయటపడింది. కాకపోతే ఆధిక్యతలో ఊగిసలాట బాగా కనబడుతోంది. ట్రంపు మీద బెడైన్ కు 4 శాతం సగటు ఆధిక్యత కనబడుతున్నా ఆధిక్యత తగ్గితే మాత్రం అందరిలోను ఉత్కంఠ పెరిగిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. 2016లో కూడా ట్రంప్-హిల్లరీ క్లింటన్ మధ్య కూడా పై రాష్ట్రాల్లో ఇటువంటి ఉత్కంఠే ఎదురైన విషయాన్ని సర్వే సంస్ధలు గుర్తుచేస్తున్నాయి.

అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ అయిన సర్వేలో పెన్సిల్వేనియా స్టేట్లో కూడా బెడైన్ కు ఆధిక్యత కనిపించినా అది చాలా తక్కువనే తేలింది. ఎందుకంటే ఈ స్వల్ప ఆధిక్యత ఎప్పుడైనా మారిపోయే అవకాశాలను మీడియా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పోన్సిల్వేనియాలో ఉన్న 538 ఓట్లలో ఎక్కువ ఎవరికి పడితే వాళ్ళే విజయానికి దగ్గరగా వెళతారన్నది వాస్తవం. ఈ ఓట్లకు సంబంధించి ఫాక్సు మీడియా జరిపిన సర్వేలో బెడైన్ 5 పాయింట్లు, సఫ్లోక్ యూనివర్సిటి పోలులో 6 పాయింట్లు, క్విన్నిపాక్ యూనివర్సిటి పోల్సులో 8 పాయింట్లు, సిఎన్ఎఎన్/ఎస్ఎస్ ఆర్ఎస్ పోల్సులో 10 పాయింట్లు అధికంగా బెడైన్ కు పదే అవకాశాలున్నట్లు తేలింది.

ఫ్లోరిడాలోని 29 ఎలక్టోరల్ ఓట్లలో ఆధిక్యత ఎవరికి దక్కుతుందనే విషయంలో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎందుకంటే ఇక్కడ మొదట ఎవరికి అనుకూలంగా ఉందని తేలినా చివరినిముషంలో ఫలితాలు తారుమారు చేసిన చరిత్ర ఫ్లోరిడా ఓటర్లుకుంది. మొదట్లో ఈ ఓట్లు ఎవరికి మద్దతుగా ఉందని అనిపించినా చివరి నిముషంలో మారిపోవటం ఫ్లారిడాలోని 29 ఎలక్టోరల్ ఓట్లకు మామూలేనట. ఫ్లోరిడా ఓట్లను తీసేస్తే ట్రంప్ కు గెలిచే అవకాశం నూటికి కేవలం 1 మాత్రమే అని సర్వేలు చెబుతున్న విషయంతో టెన్షన్ పెరిగిపోతోంది. మొత్తానికి ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్ధులలోనే కాదు ఓటర్లలో కూడా ఎన్షన్ పెరిగిపోతోందన్నది వాస్తవం.