Begin typing your search above and press return to search.

ఇటువంటి కస్టమర్లు కూడా ఉంటారా? డజన్​ అంటే 12 అని తెలియదంట?

By:  Tupaki Desk   |   19 March 2021 3:37 AM GMT
ఇటువంటి కస్టమర్లు కూడా ఉంటారా? డజన్​ అంటే 12 అని తెలియదంట?
X
ఇప్పుడంతా డిజిటల్​ యుగం. మనకు ఏదైనా వస్తువు కావాలంటే మార్కెట్​కు వెళ్లి నాణ్యత గమనించి.. బేరమాడి తెచ్చుకొనే అవసరం లేదు. ఆన్​లైన్​ లో ఆర్డర్​ చేసుకోవచ్చు. రివ్యూలు చూసి నచ్చితే ఆర్డర్లు ఇచ్చుకోవచ్చు. అయితే ఈ ఆన్​లైన్​ దందాలో అప్పడప్పుడు కొందరు వింత కస్టమర్లు కనిపిస్తుంటారు. గతంలో ఓ వ్యక్తి ఆవు పిడకలను ఆర్డర్​చేసి టేస్ట్​ చాలా చండాలంగా ఉందంటూ ఆన్​లైన్​ సంస్థ రివ్యూలో రాశాడు. అప్పట్లో ఈ రివ్యూ తెగ వైరల్​ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ మహిళ ఓ ఆన్​లైన్​ సంస్థకు పెట్టిన మెయిల్​ నవ్వు తెప్పిస్తున్నది. సదరు సంస్థ ఇచ్చిన రివ్యూ చూసి ఆ సంస్థపై గౌరవం పెరిగింది.

ఇంతకీ విషయం ఏమిటంటే?

అమెరికాలోని మిన్నెసొటాలో జదా మెక్‌ క్రే అనే ఓ ఆన్​లైన్​ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఓ మహిళ ఆన్​లైన్​ లో డజన్​ మాస్కులు ఆర్డర్​ పెట్టారు. దీంతో డజన్​ అంటే 12 కాబట్టి.. సదరు ఆన్​లైన్​ సంస్థ డజన్​ మాస్కులను ఆ మహిళకు పంపించింది. మాస్కులు ఇంటికి వచ్చేశాయి. అయితే సదరు మహిళ ఆ ఆన్​లైన్​ సంస్థకు ఆగ్రహంతో ఈమెయిల్​ పంపించింది.. ‘ నేను డజన్​ మాస్కులు ఆర్డర్​ ఇస్తే మీరు కేవలం 12 మాత్రమే పంపించారు. ఇంత మోసం చేస్తారని ఊహించలేదు. చిరు వ్యాపారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో నేను మీకు ఆర్డర్​ పెట్టాను. కానీ మీరు మాత్రం ఎంతో మోసం చేశారు. నేను ఈ మాస్కులను మీకు రిటన్​ చేస్తా’ అంటూ ఆమె మెయిల్​ పంపించింది.

ఈ మెయిల్​ చదివిన జదా మెక్​క్రే షాక్​ అయ్యారు. దీంతో సదరు మహిళకు రిప్లై ఇచ్చారు. ‘నేను చేసేది చిరు వ్యాపారమైనా ఎంతో నిజాయితీగా చేస్తాను. డజన్​ అంటే 12 . కాబట్టి మీకు పన్నెండు మాస్కులు పంపించాను. ఇందులో మా తప్పేం లేదు. క్వాంటిటీ (సంఖ్య)లో ఏమాత్రం తేడా లేదు. ఎందుకంటే మీరు అడిగిన డజన్‌ కు అర్థం 12 కాబట్టి. ఇక ఆ మాస్కులను మేం తిరిగి తీసుకోలేం. రీఫండ్ చేయలేం. అందుకు మమ్మల్ని క్షమించండి. బదులుగా మీకు మా పరిధిలో ఒక్కటి మాత్రం చేయగలం. మీకు పూర్తిగా డిస్కౌంట్ ఇవ్వగలం’ అని ఆ మహిళ బదులిచ్చారు.

మెయిల్‌కు డిస్కౌంట్ కూపన్ జత చేశారు. ఒక్కో మాస్కు ధర 5 డాలర్లు (రూ.363) కాగా.. 12 మాస్కులకు పూర్తి డిస్కౌంట్ ఇస్తున్నాం’ అంటూ ఆమె రిప్లై ఇచ్చారు.

అయినా సదరు కస్టమర్​ శాంతించలేదు. డజన్​ అంటే నేను 20 అనుకున్నాను. అంటూ ఆమె రిప్లై ఇవ్వడం గమనార్హం. ఇదిలాఉంటే సదరు ఆన్​లైన్​ దుకాణం యజమాని ఇందుకు సంబంధించిన స్క్రీన్​ షాట్లు ఆమె ట్వీట్​ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు తెగ వైరల్​ అవుతున్నాయి. అంతేకాక ఆమెకు రాత్రికి రాత్రికి గిరాకీ పెరిగింది. విపరీతమైన క్రేజ్​ వచ్చేసింది.