Begin typing your search above and press return to search.
పాత వాహనాలు ఉన్నాయా? అయితే వడ్డన తప్పదు..!
By: Tupaki Desk | 26 Jan 2021 3:00 PM ISTమీకు పాత వాహనాలు ఉన్నాయి. మీ వాహనం కొని ఎనిమిదేళ్లు అంతకంటే ఎక్కువైందా? అయితే మీకు పన్నుల మోత తప్పదు. పాత వాహనాలపై 10 నుంచి 25 శాతం గ్రీన్ టాక్స్ వేసేందుకు కేంద్రం సిద్ధమైంది. మేరకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్ చేసుకోనే టైంలో ఈ పన్ను వేయనున్నట్టు సమాచారం. మరోవైపు ప్రజారవాణా, వ్యవసాయ సంబంధిత వాహనాలకు ( ట్రాక్టర్లు, హార్వెస్టర్లు) ఈ పన్ను కొంత తక్కువ ఉండొచ్చని సమాచారం.
మరోవైపు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో దాదాపు 50 శాతం పన్ను వేయబోతున్నట్టు టాక్. అయితే పెట్రోల్ వాహనాలు, డిజిల్ వాహనాలకు వేరువేరుగా ట్యాక్స్‌లు వేయబోతున్నట్టు సమాచారం. అయితే పొల్యూషన్ ఫ్రీ వెహికిల్స్‌కు ఈ ట్యాక్స్ ఉండదు. మరోవైపు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వాడే వాహనాలకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వబోతున్నట్టు సమాచారం.
అయితే ఈ కొత్త తరహా పన్నులపై ఇప్పటికే కేంద్రప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్రాలన నుంచి ఆమోదం రాగానే కేంద్ర ప్రభుత్వం ఈ పన్నులపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. దేశంలోని వివిధ నగరాలు ఇప్పటికే కాలుష్యంలో చిక్కుకున్నాయి. ప్రధానంగా పరిశ్రమలన నుంచి వచ్చే కాలుష్యంతోపాటు, వాహన కాలుష్యం కూడా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.