Begin typing your search above and press return to search.

ఆ నియోజ‌క‌వ‌ర్గం లో ఈక్వేష‌న్లు మారుతున్నాయా?

By:  Tupaki Desk   |   31 Dec 2021 8:00 PM IST
ఆ నియోజ‌క‌వ‌ర్గం లో ఈక్వేష‌న్లు మారుతున్నాయా?
X
రాజ‌కీయాల్లో ఎప్పుడూ ఒకే విధంగా ప‌రిస్థితి ఉండ‌దు. కాలాని అనుగుణంగా.. మ‌నుషులు మార‌తారో లేదో చెప్ప‌లేం కానీ.. రాజ‌కీయాలు మాత్రం మార‌డం ఖాయం. ఇప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అదే జ‌రుగుతోంది. ప్ర‌జ‌లు `మార్పు ` వైపు అడుగులు వేస్తున్నారు. ``మేం ఎన్నో ఆశ‌ల‌తో ఓట్లేశాం. కానీ, ఆయ‌న కంటికి క‌నిపించ‌డు.

ఏదైనా స‌మ‌స్య ఉంద‌ని చెబితే.. అప్పుడు(టీడీపీ హ‌యాం) ఏం చేశారు? అని ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేకి ఏదైనా చెప్పాలంటేనే భ‌యంగా ఉంటోంది!`` అని నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌లు వాపోతున్నారు. దీంతో స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గంలో ఈక్వేష‌న్లు మారుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఆ నియోజ‌క‌వ‌ర్గమే విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో మ‌ల్లాది విష్ణు వైసీపీ టికెట్‌పై వి జయం ద‌క్కించుకున్నారు. కేవ‌లం 25ఓట్ల తేడాతో ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు.

ఆయ‌న‌కు నియోజక వ‌ర్గం కొత్త‌కాదు. గ‌తంలోనూ కాంగ్రెస్ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఆయ‌న త‌న‌కు తిరుగులేద‌ని అనుకుంటున్నారో.. లేక నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ లేద‌ని భావిస్తున్నారో.. లేక‌.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉంద‌ని అనుకుంటున్నారో.. తెలియ‌దు..కానీ.. నియోజ‌క‌వ‌ర్గాన్ని మాత్రం విస్మ‌రిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డంలేద‌ని.. వారిని క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలు.. ప‌థ‌కాల‌ను కూడా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం లేద‌ని పెద్ద ఎత్తున సొంత పార్టీలోనే విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇక్క‌డ పాత నాయ‌కుడు.. టీడీపీ నేత బొండా ఉమానే క‌రెక్ట్ అనే మాట వినిపిస్తుండ‌డం విశేషం.

నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయినా.. నియోజ‌క‌వ‌ర్గంపైమాత్రం బొండా ఉమా ప‌ట్టును ఎక్క‌డా కోల్పోకుండా చూసుకుంటున్నారుపార్టీ శ్రేణుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు.. స‌మాయత్త ప‌రుస్తూ.. ప్ర‌జ‌ల‌కు చేరువగా ఉంటూ.. ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. ముందుండి.. న‌డుస్తున్నారు. దీంతో ఇక్క‌డ ఈక్వేష‌న్లు మారుతున్నాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.