Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత జాగ్రత్తలు అవసరమేనా?
By: Tupaki Desk | 10 Dec 2020 9:28 AM ISTవణికించిన కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసింది. మరో నెలలో తెలుగు రాష్ట్రాల్లోని సామాన్యులకు సైతం అందుబాటులోకి రానుంది. ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు మరే సందర్భంలో లేని రీతిలో కరోనా సమస్యకు పరిష్కారంగా వ్యాక్సిన్ ను తీసుకురావటం.. ఇంత త్వరగా అన్నది ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. ప్రపంచాన్ని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సిద్దం చేసిన ఈ వ్యాక్సిన్ కు పరిమితులు ఉన్నాయా? అంటే ఉన్నాయనే చెబుతున్నారు.
సాధారణంగా ఒక వ్యాక్సిన్ తయారీకి ఐదారేళ్లు..కొన్ని సందర్భాల్లో పదేళ్ల సమయం తీసుకుంటుంది. అందుకు భిన్నంగా కేవలం తొమ్మిది.. పది నెలల సమయం మాత్రమే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని పరిమితులు పాటించాల్సిందేనని చెబుతున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు పక్కాగా అందుబాటులోకి రావాలంటే మరో ఆర్నెల్ల సమయం పడుతుందని చెప్పాలి.
మొదటి టీకాకు.. రెండో టీకాకు మధ్య వారం నుంచి రెండు వారాల గ్యాప్ ఉంటుంది. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవా్లసి ఉంటుంది. మొదటి టీకాతోనే కరోనా నుంచి రక్షణ లభిస్తుందనుకుంటే తప్పులో కాలేసినట్లే. రెండో డోసు వేసుకున్న తర్వాతే పూర్తి రక్షణ లభిస్తుంది. మొదటి డోసుకు రెండో డోసుకు మధ్య వ్యవధి కనిష్ఠంగా వారం నుంచి నాలుగు వారాల వరకు ఉంటుందని చెబుతున్నారు. మన దేశంలోని ఏ టీకాల్ని తీసుకురానున్న విషయంపై స్పష్టత కొరవడింది. రానున్న రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. టీకా వేసుకున్న తర్వాత కూడా కొంతకాలం పాటు మాస్కులు ధరించటం.. భౌతికదూరాన్ని పాటించటం తప్పనిసరి అవుతుందని చెబుతున్నారు. ఎందుకంటే.. తాజాగా అందుబాటులోకి వస్తున్న టీకా ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న విషయంపై మరింత స్పష్టత రావటం కోసం ఈ జాగ్రత్తలు కొంతకాలం తప్పదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. మాస్కు మన జీవితంలో ఒక భాగం అయ్యేలా కోవిడ్ చేసిందని చెప్పక తప్పదు.