Begin typing your search above and press return to search.

ఎర్రబెల్లి ప్రదీప్, దాసోజు శ్రవణ్ ఔట్ డేటెడ్ పొలిటిషియన్సా..?

By:  Tupaki Desk   |   8 Aug 2022 5:52 AM GMT
ఎర్రబెల్లి ప్రదీప్, దాసోజు శ్రవణ్ ఔట్ డేటెడ్ పొలిటిషియన్సా..?
X
తెలంగాణ బీజేపీలో చేరికల జోరు పెంచేసింది. ఇతర పార్టీల్లోని అసంతృప్త నాయకులను అనుకున్నట్లుగానే తమ వైపు తిప్పుకుంటోంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో మొదలైన ఈ అంకం ఎర్రబెల్లి ప్రదీప్ రావు, దాసోజు శ్రవణ్ ను తీసుకెళ్లే వరకు వెళ్లింది. ఎమ్మెల్యే రాజగోపాల్ కి రెడ్డి వ్యక్తిగతంగా యూత్ లో ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా మునుగోడులో ఇప్పటికే పట్టు సాధించారన్న పేరుంది. దీంతో బీజేపీ ఆయనను పార్టీలో చేర్చుకుంటే కలిసి వస్తుందని ఆలోచిస్తుంది. అయితే ఎర్రబెల్లి ప్రదీప్ రావు, దాసోజు శ్రవణ్ లు బీజేపీలోకి చేరవడంతో ఎవరికి ఉపయోగం ఉంటుందన్న కొత్త చర్చ మొదలైంది.

ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల్లో గెలవని దాసోజు శ్రవణ్ బీజేపీ తరుపున గెలుస్తాడా..? అనే అనుమానాలు మొదలయ్యాయి. అటు వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ లోని ప్రముఖులను కాదని ఎర్రబెల్లి ప్రదీప్ రావను ఆదరిస్తారా..? అని అనుకుంటున్నారు. ఔట్ డేటేడ్ పొలిటిషియన్స్ తో చేర్చుకోవడంతో బీజేపీకి ఎలాంటి ఉపయోగం ఉంటుందని బీజేపీ కేడర్ అనుకుంటోంది.

వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు. ఈయన 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ సునామిలో ఓడిపోయారు. ఆ తరువాత టీఆర్ఎస్ లోచేరారు. అయితే 2014 నుంచి తూర్పటీఆర్ఎస్ టీకెట్ ఆశిస్తూ వస్తున్నారు. కానీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అలాగే ఎమ్మెల్సీ టికెట్ కోసం కూడా కోరారు. కానీ ఆయనను కాదని మాజీ మంత్రి బస్వరాజు సారయ్యకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోనైనా టికెట్ వస్తుందని అనుకున్నారు. కానీ ఆయనకు పోటీగా నన్నపనేని నరేందర్ రెడ్డి ఉన్నారు. దీంతో ఇక తనకు టికెట్ వచ్చే అవకాశం లేదని పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రజల చేత ఎన్నుకోబడని ప్రదీప్ రావును ఇప్పుడు బీజేపీలో చేరినా ఆదరిస్తారా..? అని చర్చించుకుంటున్నారు. నిజంగా ఆయనకు ప్రజాబలం ఉండుంటి టీఆర్ఎస్ ఎందుకు వదులుకుంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఇక కాంగ్రెస్ నాయకుడు దాసోజు శ్రవన్ పరిస్థితి కూడా ఇంతే. గతంలో ఖైరతాబాద్ నియోకవర్గం నుంచి పోటీ చేసిన శ్రవణ్ ఓడిపోయారు. అంతకుముందు పోటీ చేసినా ఫలితంల లేదు. కేవలం నామినేటెడ్ పదవులతోనే నెట్టుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు కేడర్ ఎంత మేరకు ఉందో తెలియని పరిస్థితి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయనకు ప్రజాబలం ఉన్న నేత అయితే బుజ్జగించి అక్కున చేర్చుకునేంది. రాత్రి రాజీనామా చేసి పొద్దున బీజేపీలోకి వెళ్తున్నానని చెప్పినా ఎవరూ ఆయన గురించి పట్టించుకోలేదు. దీంతో ప్రజల్లో ఆయనకున్న స్ట్రాటజీ ఎంటో తెలుస్తోంది.

ఇలాంటి బ్యాక్రౌండ్ ఉన్న నాయకులను బీజేపీలోకి చేర్చుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో సీట్లు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం బీజేపీకి యూత్ ఫాలోయింగ్ బాగా ఉందని అంటున్నారు. అంతేకాకుండా కొత్తవారికి, యువతకు అవకాశం ఇస్తామని బండి సంజయ్ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ ఒక్కసారి కూడా గెలవని నేతలను పార్టీలో చేర్చుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించే వారు పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. ఆ నియోజకవర్గాల్లో ఆర్ఎస్ ఎస్ నాయకులు వీరికి సపోర్టుగా నిలిచి గెలిపించుకుంటారా..? అని అనుమానిస్తున్నారు.

ఇంతకాలం ఎంతో కష్టపడి పార్టీకి ప్రతిష్ట తెచ్చేందుకు కొందరు నేతలు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ తరుణంలో మళ్లీ టీఆర్ఎస్ లాగే ఇతర పార్టీలోని నాయకులను చేర్చుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు కష్టపడిన వారికి మొండిచెయ్యి చూపిస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి సరైన నాయకులు లేకపోవచ్చు. కానీ ఉన్న చోట కూడా ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీ ప్రతిష్ట పోవడమే తప్ప ఏముండదని అంటున్నారు. అంతో ఇంతో ప్రజా బలం ఉన్న నేత అయితే పార్టీకి లాభం చేకూరుతుంది. కానీ ఔట్ డేటేడ్ పొలిటిషియన్స్ తో పార్టీకి నష్టమే ఉంటుందని కొందరు లోలోపల చర్చించుకుంటున్నారు.