Begin typing your search above and press return to search.
బీజేపీ-టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నారా?
By: Tupaki Desk | 2 Nov 2020 5:40 PM ISTటీడీపీ అధినేత చంద్రబాబు ఒంటరిగా పోటీచేస్తే గెలవలేడని గత ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో నిరూపితమైంది. 2014లో బీజేపీ, జనసేన మద్దతు ఇవ్వడం వల్లే ఏపీలో గెలిచేశాడంటారు. ఇక అంతకుముందు కూడా బీజేపీతో పొత్తులో ఒకసారి ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చాడు. ఇలా తనకు బలం లేని చోట.. బలవంతుల పంచన చేరడం చంద్రబాబు నైజం అని రాజకీయవర్గాల్లో టాక్ ఉంది. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కూడా అంతో ఇంతో ఉన్న టీడీపీ బలాన్ని బీజేపీతో కలిసి మరింత పెంచుకోవడానికి బాబు స్కెచ్ గీశాడని.. బీజేపీ గనుక పాతపగలన్నీ మరిచిపోయి ఒప్పుకుంటే పొత్తుకు తహతహలాడుతున్నాడని టాక్ నడుస్తోంది.
దుబ్బాక ఉప ఎన్నిక ముగియగానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగించేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే పార్టీలన్నీ ఏర్పాట్లలో మునిగిపోయాయి. దుబ్బాకలో టీఆర్ఎస్ తో సై అంటే సై అని ఢీకొట్టిన బీజేపీ.. ఇప్పుడు గ్రేటర్ లోనూ సత్తా చాటాలని యోచిస్తోంది. దిగ్గజ బీజేపీ నేతలంతా హైదరాబాద్ నుంచే ఉండడంతో ప్రతిష్టాత్మకంగా ముందుకెళుతోంది.
ఇప్పటికే చంద్రబాబు గ్రేటర్ ఎన్నికలపై టీడీపీ నేతలతో సమీక్షించారు. హైదరాబాద్ నేతలతో జూమ్ యాప్ లో సమీక్ష నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. టీడీపీ తరుఫున ఎన్నికల్లో పోటీచేసే విషయమై ఆసక్తి ఉన్న నేతలతో జాబితా తయారు చేయాలని చంద్రబాబు చెప్పారట.. ప్రతీ డివిజన్లో యువనేతలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్రను ఓటర్లకు గుర్తు చేయాలని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. టీడీపీ ఖచ్చితంగా అన్ని డివిజన్లలో పోటీ చేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జీహెచ్ఎంసీ నేతలకు చెప్పాడంట..
అయితే టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే 4-5 శాతం కంటే ఓట్లు రావని.. టీడీపీకి ఓటు బ్యాంకు లేదు కాబట్టి ఎవరితోనైనా కలిసి పోటీ చేద్దాం అని జీహెచ్ఎంసీ నేతలతో చంద్రబాబు సూచించారట.. అయితే ఎవరితో కలిసి పోటీచేద్దాం అని తేల్చుకోండని చంద్రబాబు అంటే.. బీజేపీ అయితే బాగుంటుందని టీడీపీ నాయకులు సలహా ఇచ్చారట.. బీజేపీకి జీహెచ్ఎంసీలో కొంచెం పట్టు ఉంది కాబట్టి బీజేపీ-టీడీపీ కలిసి పోటీ చేస్తే కనీసం 25-30 డివిజన్లను గెలవవచ్చు అని కింది స్థాయి నాయకులు అంటున్నారట..
చంద్రబాబుకి ఈ ప్రతిపాదన ఒకే కానీ కేంద్రంలోని బీజేపీ ఒప్పుకుంటుందా? లేదా అని టీడీపీ నేతలు అనుమానపడుతున్నారట.. ఎందుకంటే ఏపీలో ఇన్ డైరెక్ట్ గా వైసీపీతో బీజేపీకి సాన్నిహిత్యం ఉంది. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ఒప్పుకుంటుందా అని కూడా అనుమానపడుతున్నారట.. ఏది ఏమైనా ఈసారి టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలంటే జీహెచ్ఎంసీలో సత్తా చాటాలని బీజేపీ తెగ హడావుడి చేస్తోందంట..
అందుకని కేంద్రంలోని బీజేపీని ఒప్పించి టీడీపీతో కలిసి పోటీ చేద్దాం అని కూడా కింది స్తాయి నేతల్లో చర్చ జరుగుతోందట.. కలిసి పోటీ చేస్తారా? లేదా అనేది వేచి చూడాలి. దుబ్బాక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దీనిపై చర్చలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.