Begin typing your search above and press return to search.

రెండు రోజుల్లో ’ప్లాస్మా‘ బ్యాంకు : సీఎం

By:  Tupaki Desk   |   29 Jun 2020 11:30 PM IST
రెండు రోజుల్లో ’ప్లాస్మా‘ బ్యాంకు : సీఎం
X
వైరస్ మహమ్మారిపై పోరాటంలో ప్లాస్మా థెరఫికి ఆశించిన ఫలితాలు రావటంతో చాలా రాష్ట్రాల్లో వైద్యులు ఇప్పుడు ప్లాస్మా థెరఫీ కే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా దేశ రాజధానిలో వైరస్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తుండటంతో ఢిల్లీ సర్కార్‌ ఈ దిశగా చర్యలు చేపడుతోంది. అతిపెద్ద వైరస్ సెంటర్‌ ను ఏర్పాటు చేయడంతో పాటు ఇంటింటి సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తోంది. అలాగే వైరస్ రోగుల చికిత్స కోసం ఢిల్లీలో ప్లాస్మా బ్యాంక్‌ ను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వైరస్ రోగుల ప్రాణాలను కాపాడటానికి మహమ్మారి నుంచి కోలుకున్నవారు పెద్ద మనసుతో ముందుకు రావాలని కేజ్రీవాల్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇప్పటి వరకూ ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ 29 మందిపై నిర్వహించామని, ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయని చెప్పారు. ఇప్పటికే వైరస్ బారినపడి కోలుకున్నవారు తమ ప్లాస్మాను దానం చేయడానికి ముందుకు రావాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఉన్న ఇన్ ‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్ వద్ద ప్లాస్మా బ్యాంకును ఏర్పాటుచేస్తున్నట్టు కేజ్రీవాల్ వెల్లడించారు. అలాగే , ఈ మహమ్మారి తో మరణించిన డాక్టర్‌ అసీం గుప్తా కుటుంబానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రూ కోటి పరిహారం ప్రకటించారు. ఇక ఢిల్లీలో ఇప్పటివరకూ 83,077 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.