Begin typing your search above and press return to search.

మహమ్మారి ఎఫెక్ట్ ..ప్రయాణికులు లేక బస్సులు వెలవెల

By:  Tupaki Desk   |   20 May 2020 11:30 AM GMT
మహమ్మారి ఎఫెక్ట్ ..ప్రయాణికులు లేక బస్సులు వెలవెల
X
మహమ్మారి దెబ్బ కు విలవిలలాడిన ఆర్టీసీ ఆదాయం లేక తీవ్రంగానే నష్టపోయింది. మార్చి 22న ప్రారంభమైన జనతా కర్ఫ్యూ, ఆ తరువాత నిరంతర లాక్‌ డౌన్ ‌తో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఆంక్షలతో కూడిన సడలింపులు ఇవ్వడంతో తెలంగాణలో బస్సు సర్వీసులు మంగళవారం ఉదయం నుంచి రోడ్డెక్కాయి. హైదరాబాద్‌ లో కేసులు అధికంగా ఉంటుండడంతో బస్సులు రోడ్డెక్కడానికి నో చెప్పారు. దాదాపు 56 రోజుల తర్వాత..హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు రోడ్డెక్కినా.. అవెక్కడానికి జనాలు మాత్రం వెనుకంజ వేస్తున్నారు.

బస్సులు బస్టాండ్లోకి వచ్చినా..డ్రైవర్, కండక్టర్ లు జనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్, సిద్ధిపేట, నిజామాబాద్, హన్మకొండ తదితర బస్టాండులో ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రయాణీకులు రావడం కనిపించింది. ఎక్కువ మంది హైదరాబాద్ వెళ్లే బస్సులు ఎక్కగా గ్రామాల వైపు, వెళ్లే బస్సులు చాలా సేపటి వరకు బస్టాండులో వెయిట్ చేసిన ఘటనలు కనిపించాయి.

మొత్తంగా 6 వే 153 బస్సులు తిప్పేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం కర్ఫ్యూ సమయానికి 3 వేల 179 బస్సులు మాత్రమే తిరిగాయని అంచనా. దీనికి ప్రధాన కారణం ఇన్ని రోజులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొని..ఇప్పుడు ఇతరులతో కలిసి బస్సుల్లో వెళ్లడం సరికాదని చాలా మంది అభిప్రాయానికి వచ్చినట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు.దీనితో పెద్దగా బస్సు ప్రయాణానికి ప్రజలు సముఖత వ్యక్తం చేయడం లేదు.

ఇన్ని రోజుల తర్వాత..ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని అనుకున్నాం..కానీ సీన్ వేరేలా ఉందని ఆర్టీసీ అధికారులు వెల్లడిస్తున్నారు. సొంత వాహనాలపై ప్రయాణీంచాలని చాలా మంది అనుకుంటున్నారని తెలిపారు. లాక్ ‌డౌన్‌ ఆంక్షలతో అంతా నిబంధనల ప్రకార మే బస్సు ప్రయాణానికి అనుమతినిచ్చారు. ముగ్గురికి కేటాయించిన సీట్లలో ఇద్దరు, ఇద్దరికి కేటాయించిన సీట్లలో ఒకరికి మాత్రమే అనుమ తించారు. తప్పనిసరిగా మాస్కులు ధరిస్తేనే ప్రయాణం చేసే విధంగా నిబంధనలు విధించారు. బస్సులో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు క్యూ పద్ధతి లో భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చూడాలి మరి .. రానున్న రోజుల్లో ఇదే సీన్ ఉంటుందా.. లేదా అనేది.