Begin typing your search above and press return to search.
జగన్ సర్కారు సంస్థ కళ్లకు ‘ప్రైవేటు’ గంతలు
By: Tupaki Desk | 22 Feb 2020 12:41 PM ISTఏపీఎస్ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తామని చెప్పి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించింది ఏపీ సర్కారు. సంస్కరణ బాట పట్టింది. ఆర్టీసీలో టికెట్ బుక్కింగ్, ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, బస్ ట్రాకింగ్ వంటి సౌకర్యాలను కల్పిస్తూ ‘ఆర్టీసీ ఆన్ లైన్ ప్యాసింజర్ రిజరస్వేషన్ సిస్టమ్ (ఓపీ ఆర్ఎస్) యాప్ ను , వెబ్ సైట్ ను ఆర్టీసీ సంస్థ స్థాపించింది. దీని ద్వారా బస్సు ప్రయాణికులందరూ ఇంట్లోనే ఉండి సదుపాయాలు వినియోగించుకునేలా విప్లవాత్మక మార్పులు తెచ్చింది.
అయితే ఎంతో ప్రజాదరణ పొందిన ఈ ఓపీఆర్ఎస్ యాప్ ను పక్కనపెట్టి ఆర్టీసీ యాజమాన్యం ‘చలో యాప్’ అనే ప్రైవేటు సంస్థ యాప్ ను ప్రోత్సహించడం ఆర్టీసీ ఆదాయానికి గండిపడేలా చేస్తోంది. నగదు రహిత సేవల విధానాన్ని చేపడుతున్న ఈ సంస్థ యాప్ లో తాజాగా రిజర్వేషన్, బస్ ట్రాకింగ్ తోపాటు యాడ్ ఆన్ ఫీచర్స్ సదుపాయం కల్పించడం తో ప్రభుత్వ యాప్ లకు ఆదరణ తగ్గుతోంది. ఈ ప్రైవేట్ సంస్థ రిజర్వేషన్లపై డిస్కౌంట్లను ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా చేస్తోంది. అసలు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణానికి ప్రైవేట్ సంస్థ యాప్ లో ఎలా డిస్కౌంట్ ఇవ్వగలుతుందనేది పెద్ద ప్రశ్న. ఆర్టీసీ నుంచి కూడా ఈ సంస్థకు ప్రోత్సహకాలు ఇస్తుండడంతో ఇది సాధ్యమవుతోందంటున్నారు.
ప్రభుత్వానికి చెందిన ఆర్టీసీ ఓపీఆర్ఎస్ యాప్స్ లో ఈ డిస్కౌంట్స్, యాడ్ ఆన్స్ లేకపోవడంతో ఎవరూ ఇందులో బుక్ చేయకుండా చలో యాప్ నే వాడేస్తున్నారు. ఆర్టీసీకి ప్రధాన ఆదాయం తెచ్చే ప్రభుత్వ యాప్ లకు ఈ ప్రైవేట్ సంస్థ యాప్ గొడ్డలిపెట్టుగా మారిందన్న విమర్శలున్నాయి. చలో యాప్ ఇప్పుడు ప్రభుత్వ యాప్ ను దెబ్బతీసి నష్టాలకు కారణమవుతోందని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు.
ఇక ఆర్టీసీ జీపీఎస్ ను వాడేస్తూ బస్సులను ట్రాకింగ్ చేస్తున్న చలోయాప్ తీరు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ బస్సులను ప్రైవేటు సంస్థ యాప్ చేతుల్లో ఉంటే విపరీత పరిణామాలకు కారణమవుతుందని ఆర్టీసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను ఇతర అవసరాలకు వాడుకుంటే పెద్ద ప్రమాదమే వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. సో ఆర్థికంగా, సామాజికంగా నష్టం తెస్తున్న ఈ ప్రైవేట్ సంస్థ యాప్ నుంచి ఆర్టీసీ సేవలను తొలగించాలని కోరుతున్నారు.